వైభవ్ సూర్యవంశీ.. మా గడ్డపై ఎలా ఆడుతాడో చూస్తాం: న్యూజిలాండ్ కోచ్
న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు కివీస్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ తెలిపాడు. ముఖ్యంగా పేస్, బౌన్సీ పిచ్‌లపై ఈ 15 ఏళ్ల కుర్రాడు ఎలా ఆడుతాడనేది తనకు ఆతృతగా ఉందని చెప్పాడు.
వచ్చె నెలలో టీమిండియా ఐదు టీ20లు, వన్డేలు, రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్టోబర్ 22 నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ సూర్యవంశీ ఇప్పటి వరకు ఆడలేదు. ఈ క్రమంలోనే అతని బ్యాటింగ్ గురించి న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'పేస్, బౌన్స్ ఎక్కువగా ఉండే పిచ్‌లపై వైభవ్ సూర్యవంశీ ఎలా ఆడుతాడో చూడాలని నాకు చాలా ఆసిక్తగా ఉంది. అతను నిజంగా అద్భుతమైన ఆటగాడు. ఐపీఎల్‌లో వరల్డ్ క్లాస్ బౌలర్లను చితక్కొట్టాడు. అయితే విభిన్న పరిస్థితులు, వాతావరణానికి అతను ఎలా అలవాటు పడుతాడనేది చూడాలి. న్యూజిలాండ్ గడ్డపై అతనికి ఎలా బౌలింగ్ చేస్తామనేది కూడా కీలకమే.

ఒక కోచ్‌గా నా మనసులో ఉన్న మాట ఏంటంటే.. ఆటగాళ్లు కాస్త ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా ఆడుతారు? ఎలా స్పందిస్తారనేది చూడాలని ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను చూసేందుకు నేను ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాను. ఒకవేళ వైభవ్.. న్యూజిలాండ్ పర్యటనలో ఆడకపోయినా.. వారి జట్టులో అతనితో పాటు చాలా మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు.
ఫైనల్లో ఓటమిపాలవ్వడం ఎవరికీ నచ్చదు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను రెండు సార్లు ఫైనల్లో విజయం సాధించలేకపోయాను. కాబట్టి నాకు ఆ అనుభవం ఉంది. అయితే ఏ మ్యాచ్ అయినా న్యూజిలాండ్ ప్రాతినిథ్యం వహిస్తూ జట్టును గెలిపించడమే మా అందరి లక్ష్యం. మా ఆటగాళ్లు కూడా దాని కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సొంతగడ్డపై కొన్ని విజయాలు సాధించగలిగితే అంతకు మించిన ఆనందం ఏం ఉంటుంది.'అని రాబ్ వాల్టర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


