Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: భారత వన్డే జట్టులో కొత్త ముఖాలు.. హార్దిక్‌కు ఎసరు పెట్టిన తెలుగోడు!

సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ వన్డే జట్టులోకి సుదీర్ఘ విరామం తర్వాత పలువురు ఆటగాళ్లు రీఎంట్రీ ఇవ్వగా.. కొందరు ఆటగాళ్లు తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నారు.

IND vs AFG: నో వైభవ్ సూర్యవంశీ.. నో వ్యూస్!

IND vs AFG: నో వైభవ్ సూర్యవంశీ.. నో వ్యూస్!

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వగా.. సుదీర్ఘ విరామం తర్వాత జడేజా, మహమ్మద్ సిరాజ్ వన్డే జట్టులో తిరిగి చోటు దక్కించుకున్నారు. ఈ వన్డే సిరీస్‌కు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో రుతురాజ్ గైక్వాడ్‌కు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. వైస్ కెప్టెన్ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించారు.

New Faces in India ODI Squad for West Indies Series Nitish Kumar Reddy Replaces Injured Hardik Pandya

రంజీ సెన్సేషన్ అకిబ్ నబీకి అవకాశం దక్కగా.. నమన్ ధీర్‌కు తొలిసారి టీమిండియా పిలుపు దక్కింది. ధ్రువ్ జురెల్‌‌ను బ్యాకప్ వికెట్‌ కీపర్‌గా తీసుకోగా.. రిషభ్ పంత్‌కు నిరాశే ఎదురైంది. ఈ సిరీస్‌కు కూడా హార్దిక్ పాండ్యా దూరం కావడంతో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని వన్డే జట్టులోకి తీసుకున్నారు. దాంతో అతన్ని ఆసియా గేమ్స్ జట్టు నుంచి తప్పించారు. ఈ సిరీస్‌లో నితీష్ రెడ్డి మెరుగైన ప్రదర్శన కనబరిస్తే.. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో చోటు దక్కించుకోనున్నాడు. హార్దిక్ పాండ్యా‌కు ప్రత్యామ్నాయంగా నితీష్ రెడ్డిని సిద్దం చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు.

ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. వరుణ్ చక్రవర్తీ పక్కటెముకల గాయంతో జట్టుకు దూరమవడంతో అతని స్థానంలో విప్రజ్ నిగమ్‌ను ఎంపిక చేశారు. నితీష్ కుమార్ రెడ్డిని ఈ జట్టు నుంచి తప్పించి వన్డే టీమ్‌లోకి తీసుకున్నారు.

IND vs WI: నో హార్దిక్, పంత్.. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ!

Also Read

IND vs WI: నో హార్దిక్, పంత్.. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ!

ఆసియా క్రీడల కోసం భారత్ టీ20 జట్టు(రివైజ్డ్):

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్.

Story first published: Wednesday, September 16, 2026, 21:57 [IST]
Other articles published on Sep 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+