IND vs WI: నో హార్దిక్, పంత్.. వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ!
సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల్లో తలపడే భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన రెండు వేర్వేరు జట్ల వివరాలను బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సిరీస్‌లకు కూడా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. రిషభ్ పంత్‌కు కూడా మొండి చెయ్యే ఎదురైంది. అతన్ని ఇరానీ కప్‌కు ఎంపిక చేశారు. రంజీ ఛాంపియన్ జమ్మూ కశ్మీర్‌తో జరిగే ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియాకు పంత్ సారథ్యం వహించనున్నాడు.
కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ..
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని వన్డే జట్టులో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు రీఎంట్రీ ఇవ్వగా.. రుతురాజ్ గైక్వాడ్, అకీబ్ నబీ, నమన్ ధీర్, గుర్నూర్ బ్రార్‌కు అవకాశం దక్కింది. ఈ సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరంగా ఉన్న నేపథ్యంలో కేఎల్ రాహుల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి.
బ్యాకప్ వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేసిన సెలెక్టర్లు ఆల్‌రౌండర్లుగా నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజాలకు అవకాశం కల్పించారు. మహమ్మద్ సిరాజ్ తిరిగి వన్డే టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వగా.. ప్రసిధ్ కృష్ణ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌కు అవకాశం దక్కింది.

వైభవ్‌కు చోటు..
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీ20 జట్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇచ్చారు.
సెప్టెంబర్ 27, 30, అక్టోబర్ 3 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. అక్టోబర్ 6, 9, 11, 14, 17 తేదీల్లో ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. నాలుగో టీ20 హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేసిన భారత టీ20 జట్టులో స్వల్ప మార్పు జరిగింది. వరుణ్ చక్రవర్తీ పక్కటెముకల గాయంతో జట్టుకు దూరమవడంతో అతని స్థానంలో విప్రజ్ నిగమ్‌ను ఎంపిక చేశారు. నితీష్ కుమార్ రెడ్డిని ఈ జట్టు నుంచి తప్పించి వన్డే టీమ్‌లోకి తీసుకున్నారు.
భారత్ వన్డే జట్టు :
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహమ్మద్ సిరాజ్, అకిబ్ నబీ, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్.
భారత్ టీ20 జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్.
ఆసియా క్రీడల కోసం భారత్ టీ20 జట్టు(రివైజ్డ్):
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ, యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్.
రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు :
రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), సనత్ సాంగ్వాన్, శిఖర్ మోహన్, సుదీప్ ఘరామి, సర్ఫరాజ్ ఖాన్ (వైస్ కెప్టెన్), స్మరణ్ రవిచంద్రన్, మానవ్ సుతార్, సారాంశ్ జైన్, ఆకాశ్ దీప్*, ముకేష్ కుమార్, ముకేష్ చౌదరి, ఆర్యన్ జుయల్ (వికెట్ కీపర్), ఆర్యన్ పాండే, అనుకుల్ రాయ్, ఆయుష్ దోసేజా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


