For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాండ్యా.. నీ విధ్వంసకర సెంచరీతో నా హృదయం ఉప్పొంగింది: నటాషా

Natasa Stankovic hails fiancé Hardik Pandya’s blistering century in DY Patil T20 tournament

ముంబై: వెన్ను గాయం నుంచి కోలుకొని ఫిట్‌గా మారిన భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్న విషయం తెలిసిందే. దేశవాళీ టోర్నీ డీవైపాటిల్ టీ20 ‌కప్‌లో 37 బంతుల్లోనే సెంచరీ చేసి తన సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. కేవలం 8 డాట్ బాల్స్ మాత్రమే ఆడిన ఈ బరోడా క్రికెటర్ 10 సిక్సర్లు, 7 ఫోర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇక పాండ్యా విధ్వంసకర ఇన్నింగ్స్‌పై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోంది. పాండ్యా ఈజ్ బ్యాక్ అనే హ్యాష్ టాగ్‌తో సోషల్ మీడియా దద్దరిల్లుతోంది.

మై హార్ట్ ఈజ్ ఫుల్..

మై హార్ట్ ఈజ్ ఫుల్..

పాండ్యాకు కాబోయే భార్య, నటి నటాషా స్టాంకోవిచ్‌ కూడా అతనిపై పొగడ్తల వర్షం కురిపించింది. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత పాండ్యా పెవిలియన్‌కు వెళ్తున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌‌ చేసిన ఆమె.. ‘హార్దిక్‌ కుంగ్‌ ఫూ పాండ్యా 37 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ద డెడ్లీ హిట్టర్ ఈజ్‌ బ్యాక్‌ టు వర్క్‌..'అనే క్యాప్షన్‌తో కొనియాడింది. అలాగే, గర్జిస్తున్న సింహం, మై హార్ట్ ఈజ్‌ఫుల్ అనే స్టిక్కర్లను కూడా జత చేసింది.

కొత్త ఏడాది ఒక్కటైన జంట..

కొత్త ఏడాది ఒక్కటైన జంట..

హార్దిక్‌ పాండ్యా, నటాషా స్టాన్‌కోవిచ్‌ ఎంగేజ్‌మెంట్ జనవరి 1న జరిగిన విషయం తెలిసిందే. కొత్త సంవత్సరం 2020 వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో స్పీడ్‌ బోట్‌లో విహరిస్తూ హార్దిక్ త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు రింగ్ తొడిగాడు. ఆ తర్వాత కేక్ కట్ చేసి తమ నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఎంగేజ్‌మెంట్ ఫోటోలను పోస్టు చేసిన పాండ్యా.. 'నీకు నేను, నాకు నువ్వు, హిందుస్తాన్ మొత్తానికి ఇది తెలియాలి' అని క్యాప్షన్‌గా పెట్టాడు.

దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో సహజీవనం చేసి తప్పు చేశా : స్టార్ హీరోయిన్

ఒకే ఓవర్లో 26 పరుగులు..

ఒకే ఓవర్లో 26 పరుగులు..

డీవైపాటిల్ టీ20లో టోర్నీలో భాగంగా మంగళవారం సీఏజీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రిలయన్స్-1 జట్టు తరఫున బరిలోకి దిగిన పాండ్యా(39 బంతుల్లో 7 ఫోర్లు 10 సిక్సర్లతో 105) అద్భుత సెంచరీ సాధించాడు. అతడి విధ్వంసానికి సీఏజీ బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. వీ జీవరాజన్‌ వేసిన 15వ ఓవర్లో అయితే పాండ్యా 3 సిక్సర్లు, 2 ఫోర్లతో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు.

పాండ్యా సూపర్ సెంచరీతో రిలయన్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 252 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సీఏజీ 151 పరుగులే చేసి 101 పరుగులతో ఓడింది. ఈ టోర్నీలో శిఖర్ ధావన్ కూడా ఆడుతుండగా.. అతను డకౌటై మరోసారి నిరాశపరిచాడు.

భారత్‌కు వచ్చినప్పుడు.. తానేంటో చూపిస్తానన్న కోహ్లీని చూస్తే నవ్వొస్తుంది : ఆసీస్ పేసర్

సౌతాఫ్రికాతో రీ ఎంట్రీ..

సౌతాఫ్రికాతో రీ ఎంట్రీ..

పునరాగమనంలో పాండ్యాకు ఇది రెండో మ్యాచ్‌. మొదటి మ్యాచ్‌లో పాండ్యా 25 బంతుల్లో 38 పరుగులు సాధించాడు. గత సెప్టెంబరులో భారత్‌ తరఫున అతను చివరిసారిగా మ్యాచ్‌ (సౌతాఫ్రికాపై టి20) ఆడాడు. ఆ తర్వాత వెన్ను నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకొని జాతీయ క్రికెట్‌ అకాడమీలో పునరావాస కార్యక్రమంలో పాల్గొని ఫిట్‌గా మారాడు. సౌతాఫ్రికాతో త్వరలో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు పాండ్యా మళ్లీ ఎంపికయ్యే అవకాశం ఉంది.

Story first published: Wednesday, March 4, 2020, 19:22 [IST]
Other articles published on Mar 4, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+