IPL 2027: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ!
ఐపీఎల్ 2027 సీజన్ మినీ వేలానికి ముంబై ఇండియన్స్ సన్నదమవుతోంది. ఇప్పటికే కోచింగ్ స్టాఫ్‌ను ప్రక్షాళన చేసిన ముంబై ఇండియన్స్.. కీరన్ పోలార్డ్‌కు హెడ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది. మిగతా సపోర్ట్ స్టాఫ్ మెంబర్స్‌ను కూడా మార్చేందుకు సిద్దమైంది. లసిత్ మలింగా, పరాస్ మాంబ్రే, కార్ల్ హప్‌కిన్సన్‌లకు వీడ్కోలు పలికిన ముంబై ఇండియన్స్.. వారి స్థానాల్లో కొత్త కోచ్‌లను నియమించనుంది.
రోహిత్‌కు కెప్టెన్సీ..?
హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆశించిన ఫలితాలు దక్కకపోవడంతో కెప్టెన్‌ను కూడా మార్చాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మకు తిరిగి సారథ్య బాధ్యతలు అప్పగించాలా? లేక టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మను ఎంపిక చేయాలనే విషయంలో మేనేజ్‌మెంట్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచకప్ విజేత సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా రూపంలో మరో రెండు కెప్టెన్సీ ఆప్షన్ ఉన్నప్పటికీ.. వారికి సారథ్య బాధ్యతలు అప్పగించే యోచనలో మేనేజ్‌మెంట్ లేనట్లు సమాచారం. సూర్య కెరీర్ చివరి దశలో ఉండగా.. బుమ్రాపై కెప్టెన్సీతో అదనపు భారం పెట్టడం సరికాదని భావిస్తోంది.

జట్టులోనే హార్దిక్ పాండ్యా..
మరోవైపు హార్దిక్ పాండ్యాను మెగా వేలం వరకు జట్టులోనే ఆటగాడిగా కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్లేయర్ ట్రేడింగ్ ద్వారా అతనికి తగ్గ ఆటగాళ్లు దొరక్కపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'హార్దిక్ పాండ్యా మేనేజ్‌మెంట్‌తో గొడవపడే వ్యక్తి కాదు. అతనికి తగిన ట్రేడ్ లభించకపోతే కచ్చితంగా ముంబై ఇండియన్స్‌లోనే మరో ఏడాది పాటు కొనసాగుతాడు.
కెప్టెన్సీ లేకపోయినా ఆటగాడిగా 100 శాతం ఎఫర్ట్ పెడుతాడు. అతని నిబద్దతలో ఎలాంటి లోపం ఉండదు. అయితే ట్రేడ్ డీల్ అనేది అతని చేతుల్లో లేదు. ఏ ట్రేడ్ ఆఫర్‌లోనైనా లాభనష్టాలను పరిశీలించేది ముంబై యాజమాన్యమే.'అని ఓ అధికారి పీటీఐకి తెలిపాడు.
రోహిత్‌కే ఎక్కువ ఛాన్స్..
ఐపీఎల్ 2027 సీజన్ సమయానికి రోహిత్ శర్మ వయసు 40 ఏళ్లకు చేరుతుంది. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత అతను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించి సగర్వంగా అతనికి వీడ్కోలు పలకాలనే ఉద్దేశంలో ముంబై మేనేజ్‌మెంట్ ఉన్నట్లు సమాచారం.
రోహిత్ పర్యవేక్షణలో తిలక్ వర్మను జట్టు భవిష్యత్తు సారథిగా తీర్చిదిద్దాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.హెడ్ కోచ్ కీరన్ పోలార్డ్‌తో రోహిత్ శర్మకు మంచి అనుబంధం ఉంది. రోహిత్ కెప్టెన్సీలో పోలార్డ్ ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ముంబై ఇండియన్స్ ఓనర్ ఆకాష్ అంబానీ, టాప్ అఫిషియర్ రాహుల్ సంఘ్వీ, హెడ్ కోచ్ కీరన్ పోలార్డ్.. తదుపరి కెప్టెన్ ఎవరా? అనేది నిర్ణయించనున్నారు. రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారా? లేక తిలక్ వర్మతో కొత్తగా ప్రారంభిస్తారా? అనేది చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


