IPL 2027: పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా? ముంబైలోకి ఆ ఇద్దరు మ్యాచ్ విన్నర్లు!
ఐపీఎల్ 2027 సీజన్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బదిలీకి సంబంధించి అనేక ఊహగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే హార్దిక్ పాండ్యా కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్‌తో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఈ డీల్స్ సెట్ కాలేదని ప్రచారం జరిగింది.
తాజాగా హార్దిక్ పాండ్యా కోసం పంజాబ్ కింగ్స్ తీవ్రంగా ప్రయత్నిస్తుందని, అతని కోసం యుజ్వేంద్ర చాహల్, మార్కో జాన్సెన్‌లను ముంబై ఇండియన్స్‌కు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని కథనాలు వస్తున్నాయి. టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా హార్దిక్‌ను తీసుకునేందుకు పంజాబ్ కింగ్స్ ఆసక్తిగా ఉందని చెప్పడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
అశ్విన్ మాటలతో..
అయితే ఈ ఊహాగానాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ ముంబై, పంజాబ్ మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయనే వాదన మాత్రం వినిపిస్తోంది. అయితే హార్దిక్ పాండ్యాను తీసుకునేందుకు పంజాబ్ కింగ్స్ సిద్దంగా ఉన్నా.. కెప్టెన్సీ మాత్రం ఇవ్వలేదని అశ్విన్ తెలిపాడు. అతన్ని కేవలం పేస్ ఆల్‌రౌండర్‌గానే తీసుకునేందుకు పంజాబ్ కింగ్స్ సిద్దంగా ఉందని అశ్విన్ స్పష్టం చేశాడు.

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఆ జట్టుకు టైటిల్ అందించడంతో పాటు మరో సీజన్‌లో ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత అతను ముంబై ఇండియన్స్‌లోకి రాగా.. గత మూడు సీజన్లలో ఆ జట్టు ఒకే ఒక్కసారి ప్లే ఆఫ్స్ చేరింది. మరో రెండు సార్లు పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానాల్లో నిలిచింది. ఈ క్రమంలోనే ఆ జట్టును వీడేందుకు హార్దిక్ సిద్దమయ్యాడనే వార్తలు తెరపైకి వచ్చాయి.
హార్దిక్‌తో పంజాబ్‌కు ఫాయిదా ఏంటంటే?
టీమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని హార్దిక్ పాండ్యాను తీసుకునేందుకు పంజాబ్ కింగ్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఆల్‌రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా రాకతో పంజాబ్‌కు మంచి సమతూకం లభిస్తోంది. ముఖ్యంగా ఎక్స్‌ట్రా ఓవర్‌సీస్ పేసర్‌పై ఆధారపడే పరిస్థితి ఉండదు. తుది జట్టు ఎంపిక కూడా ఈజీ కావడంతో చాలా ఆప్షన్స్ లభిస్తాయి.
మరోవైపు మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ రాకతో ముంబై టీమ్ కూడా పటిష్టం కానుంది. ముఖ్యంగా స్పెషలిస్ట్ స్పిన్నర్ లేక ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్‌కు చాహల్‌తో ఆ లోటు తీరనుంది. మార్కో జాన్సెన్‌తో మంచి పేస్ ఆల్‌రౌండర్ ఆప్షన్ లభిస్తుంది. ప్రస్తుతానికి అయితే హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవితవ్యంపై అనిశ్చితి నెలకొంది. ఫ్రాంచైజీలు ఏవైనా చర్చలు, ఒప్పందాన్ని ధృవీకరించే వరకు పంజాబ్ కింగ్స్‌కు వెళ్లడాన్ని కూడా ఒక అవకాశంగా మాత్రమే చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


