హార్దిక్ పాండ్యాను కలిసేందుకు 2400 కిలోమీటర్లు నడిచిన డైహార్డ్ ఫ్యాన్!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కలిసేందుకు ఓ అభిమాని ఏకంగా 2400 కిలోమీటర్లు నడిచాడు. లక్నో నుంచి ముంబై, అక్కడి నుంచి బెంగళూరు వరకు పాదయాత్ర చేసి మరీ తన అభిమాన ఆటగాడిని కలుసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
గాయంతో భారత జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రిహాబిలిటేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలియని లక్నోకు చెందిన రవికుమార్ రావత్ అనే క్రికెట్ అభిమాని.. హార్దిక్ పాండ్యాను కలిసేందుకు ముంబైకి పాదయాత్రగా 1400 కిలోమీటర్లు నడిచి వచ్చాడు. అక్కడ అతను లేడని తెలిసి బెంగళూరుకు వెళ్లేందుకు సిద్దమయ్యాడు.
ఈ క్రమంలో ఓ ప్లకార్డ్ పట్టుకొని పాదయాత్ర ద్వారా ముంబై నుంచి బెంగళూరుకు చేరుకున్నాడు. సీఓఈలో రవిని హార్దిక్ పాండ్యా కలిసాడు. అతనితో కాసేపు ముచ్చటించాడు. 'ఎలా ఉన్నావు? ఏమైనా కావాలా? నీ కోసం ఏదైనా చేయగలనా? 'అన్నట్లు హార్దిక్ పాండ్యా అన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. తప్పకుండా మళ్లీ కలుద్దామని సదరు అభిమానికి హార్దిక్ పాండ్యా ప్రామిస్ చేశాడు. తన ఇంటికి తిరిగి వెళ్లేందుకు అవసరమైన టికెట్‌నూ హార్దిక్ పాండ్యా సమకూర్చాడు.

హార్దిక్ పాండ్యాను కలిసేందుకు అభిమానులు ఇలాంటి సాహసం చేయడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఆరంభంలో ఒడిశాకు చెందిన దీపక్ కుమార్ అనే అభిమాని కూడా హార్దిక్‌ను కలిసేందుకు ఇలాంటి సాహసమే చేశాడు. ఒడిశా నుంచి బెంగళూరు వరకు సైకిల్‌పై ప్రయాణించాడు.
ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో గాయపడిన హార్దిక్ పాండ్యా.. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. మధ్యలో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైనా.. పదే పదే గాయాలవ్వడంతో సాధ్యం కాలేదు. మరోవైపు హార్దిక్ పాండ్యా ప్రత్యామ్నాయాన్ని భారత జట్టు కనుగోనలేకపోతుంది. హార్దిక్ లేని లోటు తీర్చడం చాలా కష్టమని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
'హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం కనుగొనడం చాలా కష్టం. అతను జట్టులో భర్తీ చేయలేని ఆటగాడు. అతనికి ప్రత్యామ్నాయ ఆటగాడిని వెతికే బదులు.. విభిన్నమైన ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి.'అని గవాస్కర్ సూచించాడు. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో నితీష్ రెడ్డికి మూడు ఫార్మాట్లలో అవకాశాలు దక్కుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
