Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారి వల్లే ఈ ఘన విజయం: హర్మన్‌ప్రీత్ కౌర్

స్మృతి మంధాన, షెఫాలీ వర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తోనే భారీ విజయాన్ని అందుకున్నామని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. షెఫాలీ వర్మ బంతితో కూడా రాణించడం జట్టుకు కలిసొచ్చే అంశమని చెప్పింది. మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నెదర్లండ్స్‌తో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

T20 WC 2026: నిప్పులు చెరిగిన శ్రీచరణి.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం!

T20 WC 2026: నిప్పులు చెరిగిన శ్రీచరణి.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం!

అసాధారణ బ్యాటింగ్‌తో..

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. సమష్టి ప్రదర్శనతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచామని చెప్పింది. 'మేం బ్యాటింగ్‌లో చాలా అద్భుతంగా రాణించాం. ఈ వికెట్ బ్యాటింగ్‌కు అంత సులువుగా ఏం లేదు. కానీ స్మృతి, షెఫాలీ మాకు ఒక గొప్ప భాగస్వామ్యాన్ని అందించారు. జట్టుకు అవసరమైనప్పుడల్లా షెఫాలీ వర్మ బంతితో ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కీలకమైన బ్రేక్‌థ్రూలు అందిస్తోంది. భవిష్యత్తులో తను ఒక గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదగగలదు.

T20 World Cup 2026 Harmanpreet Kaur Hails Mandhana-Shafali Duo and WPL Star Nandani After Win Over Netherlands

శ్రేయాంక పాటిల్ గాయం గురించి ప్రస్తుతం నా దగ్గర స్పష్టమైన అప్‌డేట్ లేదు. కానీ మా మెడికల్ టీమ్ ఆమెను పరీక్షించిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తుంది. ప్రస్తుతం మేం చాలా మంచి స్థితిలో ఉన్నాం. ఈ రెండు మ్యాచ్‌ల్లో మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించాం. పేసర్లలో క్రాంతి ఎప్పుడూ మా కోసం అద్భుతంగా బౌలింగ్ చేస్తోంది. అలాగే నందినికి డబ్ల్యూపీఎల్‌తో మంచి అనుభవం వచ్చింది. ఆ జోరును ఇక్కడ కొనసాగించింది. ముఖ్యంగా పవర్‌ప్లేలోనే మాకు కావాల్సిన బ్రేక్‌థ్రూలు అందిస్తోంది.'అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది.

చెలరేగిన స్మృతి, షెఫాలీ, శ్రీచరణి

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన(47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 74), షెఫాలీ వర్మ(38 బంతుల్లో 10 ఫోర్లతో 55) హాఫ్ సెంచరీలతో రాణించగా.. రిచా ఘోష్(8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20 నాటౌట్) దూకుడుగా ఆడింది. నెదర్లాండ్స్ బౌలర్లలో కరోలిన్ డి లెంగే(2/32) రెండు వికెట్లు తీయగా.. ఇరిస్ జ్విల్లింగ్, హీథర్ సీగర్స్, మిర్తే వాన్ డెన్ రాడ్ తలో వికెట్ తీసారు.

అనంతరం నెదర్లాండ్స్ 17.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. బాబెట్ డీ లీడే(27 బంతుల్లో 3 ఫోర్లతో 28), హీథర్ సీగర్స్(16 బంతుల్లో 4 ఫోర్లతో 21) మినహా అంతా విఫలమయ్యారు. తెలుగు తేజం శ్రీచరణి(4/19) నాలుగు వికెట్లతో నెదర్లాండ్స్ పతనాన్ని శాసించగా.. షెఫాలీ వర్మ(3/20) మూడు వికెట్లు పడగొట్టింది. నందని శర్మకు రెండు వికెట్లు తీయగా.. దీప్తి శర్మకు ఒక వికెట్ దక్కింది.

ఈ లింక్ ఏంది సామీ?: స్మృతి మంధానపై డీకే సంచలన కామెంట్స్

ఈ లింక్ ఏంది సామీ?: స్మృతి మంధానపై డీకే సంచలన కామెంట్స్
Story first published: Thursday, June 18, 2026, 10:09 [IST]
Other articles published on Jun 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+