IPL 2027: పోలార్డ్‌కు ప్రమోషన్.... ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా విధ్వంసకర ఆల్‌రౌండర్!
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ నియమితులయ్యాడు. సుదీర్ఘ కాలం జట్టుకు సేవలందించిన మహేళ జయవర్దనే హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పుకోవడంతో బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న పొలార్డ్‌కు ముంబై మేనేజ్‌మెంట్ ప్రమోషన్ ఇచ్చింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనను విడుదల చేసింది.
'ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా కీరన్ పోలార్డ్ నియమితులయ్యాడనే విషయాన్ని సంతోషంగా ప్రకటిస్తున్నాం. క్రికెట్ చరిత్రలోనే ఆటగాడిగా.. ఇప్పుడు కోచ్‌గా ఒకే జట్టుతో సుదీర్ఘ కాలం ప్రయాణిస్తున్న అరుదైన బంధం ఇది.'అని ముంబై ఇండియన్స్ తమ ప్రకటనలో పేర్కొంది.

నాకు దక్కిన గౌరవం..
ముంబై ఇండియన్స్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం తనకు లభించిన గొప్ప గౌరవమని కీరన్ పొలార్డ్ ఈ ప్రకటనలో పేర్కొన్నాడు. 'ముంబై ఇండియన్స్ నా జీవితంలో ఒక పెద్ద భాగం. ఈ జట్టుతో, సహచర ఆటగాళ్లతో పాటు పఅభిమానులతో నాకున్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది.
ఆటగాడిగా.. కోచ్‌గా ఈ జట్టుతో సుదీర్ఘ ప్రయాణం చేసిన నాకు ముంబై ఇండియన్స్ విలువ ఏంటి? ఈ బ్లూ అండ్ గోల్డ్ జెర్సీని ధరించడంలో ఎంత బాధ్యత ఉంటుందో బాగా తెలుసు. ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి పనిచేసేందుకు, జట్టు లెగసీని ముందుకు తీసుకెళ్లేందుకు, కొత్త ఆటగాళ్లను తీర్చిదిద్దడానికి, అభిమానులకు మళ్లీ వేడుకలు చేసుకునే అవకాశాలను అందించేందుకు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.'అని కీరన్ పొలార్డ్ తెలిపాడు.
మా కుటుంబంలో ఒకడు..
కీరన్ పొలార్డ్ తమ కుటుంబంలో ఒకడని ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ ప్రశంసలు కురిపించారు. 'పొలార్డ్ 22 ఏళ్ల వయసులో ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు. గత 16 ఏళ్లలో మా కుటుంబంలో ఒక సభ్యుడిగా మారిపోయాడు. ఆటగాడిగా మాకు ఎన్నో మరిచిపోలేని క్షణాలను అందించాడు. ఆ తర్వాత కోచ్‌గా తన అనుభవాన్ని, ఆటపై ఉన్న అవగాహనను జట్టుతో పంచుకుంటూనే ఉన్నాడు.
ఇప్పుడు హెడ్ కోచ్‌గా అతను కొత్త బాధ్యతను స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. ముంబై జెర్సీ వేసుకోవడం అంటే.. అభిమానుల కోసం ఆడటం ఎంత విలువైందో పోలార్డ్‌కు బాగా తెలుసు. ఆటగాడిగా అతను చూపించిన పట్టుదల, నమ్మకం, అంకితభావాన్ని ఈ కొత్త రోల్‌లో కూడా చూపిస్తాడని విశ్విస్తున్నాను. హెడ్ కోచ్‌గానూ అతను సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.'అని నీతా అంబానీ పేర్కొన్నారు.
గత 16 ఏళ్లుగా ముంబైలోనే..
ఐపీఎల్ 2010 నుంచి 2022 వరకు ముంబై ఫ్రాంచైజీ ఆడిన కీరన్ పొలార్డ్ ఆ తర్వాత బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు చేపట్టాడు. ముంబై తరఫున మొత్తం 189 మ్యాచ్‌లు ఆడి 3412 పరుగులతో పాటు 69 వికెట్లు పడగొట్టాడు. ముంబై గెలిచిన (2013, 2015, 2017, 2019, 2020) ఐదు టైటిళ్లలో పొలార్డ్ భాగంగా ఉన్నాడు.
హెడ్ కోచ్‌గా కీరన్ పొలార్డ్ రిటెన్షన్ ప్రక్రియపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నవంబర్ 15న రిటెన్షన్ జాబితాలు ప్రకటించేందుకు గడువు కాగా.. డిసెంబర్‌లో గోవా వేదికగా ఐపీఎల్ 2027 మినీ వేలం జరగనుంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో చివరిసారిగా విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ గతే 6 ఏళ్లుగా నిరాశపర్చింది.
ఇతర ఫ్రాంచైజీ లీగ్స్‌లో కూడా పొలార్డ్ ముంబై ఇండియన్స్ కుటుంబంలో భాగంగా ఉన్నాడు. ది హండ్రెడ్‌లో ఎంఐ లండన్‌కు హెడ్ కోచ్‌గా.. వేజర్ లీగ్ క్రికెట్‌లో ఎంఐ న్యూయార్క్, సౌతాఫ్రికా 20 లీగ్‌లో ఎంఐ కేప్ టౌన్, ఐఎల్ టీ20లో ఎంఐ ఎమిరేట్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అప్‌కమింగ్ సౌతాఫ్రికా 20 లీగ్‌లో మాత్రం జోహన్నస్ బర్ల్ సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


