IPL 2027: ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పు.. హెడ్ కోచ్ రాజీనామా!
ఐపీఎల్ 2027 సీజన్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో కీలక మార్పు చోటు చేసుకుంది. సుదీర్ఘ కాలం జట్టుకు సేవలందించిన హెడ్ కోచ్ మహేళ జయవర్దనే తన పదవికి రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి మహేళ జయవర్దనే తప్పుకున్నాడని పేర్కొంది.
ఐపీఎల్ 2017 నుంచి 2022 వరకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించిన మహేళ జయవర్దనే.. తర్వాతి రెండేళ్లు ముంబై గ్లోబల్ హెడ్‌గా సేవలందించాడు. తిరిగి ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు ఆకస్మాత్తుగా తప్పుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆశించిన ఫలితాలను సాధించకపోవడంతో మేనేజ్మెంటే అతన్ని తప్పించినట్లు తెలుస్తోంది.

జీవితానికి సరిపోయే జ్ఞాపకాలు..
ముంబై హెడ్ కోచ్‌గా పనిచేసిన రోజులు జీవితాంతం గుర్తుకు ఉంటాయని ఈ సందర్భంగా మహేళ జయవర్దనే తెలిపాడు. '10 ఏళ్లకు పైగా ముంబై ఇండియన్స్‌లో సాగిన ప్రయాణం నా జీవితంలో చాలా ప్రత్యేకమైనది. ప్లేయర్లు, కోచింగ్ టీమ్, అండగా నిలిచి ముంబై కుటుంబం, ముఖ్యంగా అభిమానుల ప్రేమాభిమానాలు.. ఈ అనుభవాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేశాయి.
మేమంతా కలిసి ఎన్నో మధురమైన క్షణాలను పంచుకున్నాం. అనేక సవాళ్లను ఎదుర్కొని గర్వపడే స్థాయికి జట్టును చేర్చాం. ఇన్నేళ్లుగా నాపై ఎంతో నమ్మకం ఉంచి, మద్దతు తెలిపిన టీమ్ ఓనర్ నీతా అంబానీ, ఆకాష్ అంబానీలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేం సాధించిన విజయాల పట్ల ఎంతో గర్వంగా ఉంది. ఈ ఫ్రాంచైజీకి నా గుండెల్లో ప్రత్యేకమైన స్థానం ఉందని చెబుతూ.. వీడ్కోలు తీసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఈ జట్టు మరిన్నీ విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.'అని మహేళ జయవర్దనే పేర్కొన్నాడు.

మూడు టైటిళ్లు అందించిన జయవర్దనే
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు మార్క్ బౌచర్ స్థానంలో జయవర్దనే హెడ్ కోచ్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టాడు. 2022-2024 మధ్య ముంబై గ్లోబల్ హెడ్‌గా ఎంఐ ఎమిరెట్స్, ఎంఐ న్యూయార్క్, ఎంఐ కేప్‌టౌన్ జట్లను పర్యవేక్షించాడు. జయవర్దనే హయాంలో ముంబై ఇండియన్స్ మూడు టైటిళ్లు గెలిచింది. కానీ రెండోసారి మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. ఐపీఎల్ 2025లో క్వాలిఫయర్-2 చేరిన ముంబై.. ఐపీఎల్ 2026 సీజన్లో 9వ స్థానంలో నిలిచింది.
మహేళ జయవర్దనే సేవలను ముంబై ఫ్రాంచైజీ ఓనర్ నీతా అంబానీ ప్రత్యేకంగా కొనియాడారు. ముంబై కుటుంబంలో ఆయన ఎప్పటికీ భాగమేనని స్పష్టం చేశారు. మహేళతో కలిసి చేసిన ప్రయాణాన్ని మరిచిపోమని, ఆయన భవిష్యత్తు మరింత బాగుండాలని ఆకాంక్షించారు. జయవర్దనే రాజీనామాతో ముంబైకి కొత్త కోచ్‌ను నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిటెన్షన్ ప్రక్రియకు నవంబర్ 15నే గడువు కాగా.. ఆలోపు కొత్త కోచ్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ చివరిసారిగా ఐపీఎల్ 2020 సీజన్లో విజేతగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


