Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: ముంబై ఇండియన్స్ ఆఫర్‌ను తిరస్కరించిన రాహుల్ ద్రవిడ్, గిల్‌క్రిస్ట్.. రేసులో ఆ ఇద్దరు!

ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి మహేళ జయవర్దనే తప్పుకోవడంతో ఆ జట్టు కొత్త కోచ్ కోసం అన్వేషణ మొదలు పెట్టింది. ఐపీఎల్ 2027 సీజన్ మినీ వేలానికి సమయం తక్కువగా ఉండటంతో కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. అయితే ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ అనడంలో సందేహం లేదు. ఆ జట్టుకు ప్రజాదరణ కూడా ఎక్కువే. ముంబై తరఫున ఆడితే కెరీర్ సెట్ అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లంతా అనుకుంటారు. అంతలా ఎక్స్‌పోజర్ లభిస్తుంది. ఆటగాళ్లకే కాదు కోచ్‌లకు కూడా అదే స్థాయిలో గుర్తింపు ఉంటుంది. అలాంటి ముంబై ఇండియన్స్ ఆఫర్‌‌ను టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్‌, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

IPL 2027 Rahul Dravid and Adam Gilchrist Reject Mumbai Indians Head Coach Offers After Mahela Jayawardene Exit

కుటుంబం కోసం ద్రవిడ్ అనాసక్తి..

ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ పదవి చేపట్టేందుకు తమకు ఆసక్తి లేదని ముఖం మీదే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 2024 టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియా హెడ్ కోచ్‌గా తన పదవి కాలాన్ని ముగించుకున్న రాహుల్ ద్రవిడ్.. కుటుంబంతో గడిపేందుకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. తన కుమారులు అన్వే ద్రవిడ్, సమిత్ ద్రవిడ్‌ల కెరీర్‌పై అతను ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

వినూమన్కడ్ ట్రోఫీలో అన్వే ద్రవిడ్(100 బంతుల్లో 23 ఫోర్లతో 151) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పుకున్న రాహుల్ ద్రవిడ్.. మళ్లీ కోచింగ్ బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా లేనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2028లో అతను మళ్లీ కోచ్‌గా రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

రేసులో మైక్ హస్సీ, ఆరోన్ ఫించ్..

అగ్రశ్రేణి కోచ్‌లు ముంబై ఆఫర్ తిరస్కరించడంతో.. ఇటీవల సీఎస్‌కేను వీడిన మైక్ హస్సీ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికా ఫ్రాంచైజీ టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు మూడు టైటిళ్లు అందించిన ఏడ్రియన్ బిరెల్ పేరును కూడా ముంబై ఫ్రాంచైజీ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతను కూడా విముఖత చూపినట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఆరోన్ ఫించ్, మైక్ హస్సీలో ఒకరు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

కొత్త హెడ్ కోచ్ నియామకం పూర్తయిన తర్వాత సపోర్ట్ స్టాఫ్‌ను కూడా మార్చే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్‌గా కీరన్ పొలార్డ్, బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగా, పరాస్, ఫీల్డింగ్ కోచ్‌గా కార్ల్ హాప్‌కిసన్‌ల పదవులపై కూడా అనిశ్చితి నెలకొంది.

Story first published: Saturday, October 17, 2026, 22:14 [IST]
Other articles published on Oct 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+