160 స్కోర్ చేయలేదు..
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, పాండ్యా బ్రదర్స్ వంటి భారీ హిట్టర్లు ఉన్న ముంబై ఇప్పటి వరకు కనీసం 160 పరుగులు చేయలేదంటే ఆ టీమ్ బ్యాటింగ్ ఎంత పేలవంగా ఉందో అర్థం మవుతోంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పల్టాన్స్.. 131 (పంజాబ్‌పై), 137(ఢిల్లీ), 150(సన్‌రైజర్స్), 152(కేకేఆర్), 159(ఆర్‌సీబీ)పై చేసింది. ఇందులో సన్‌రైజర్స్, కేకేఆర్‌లపై బౌలింగ్‌తో గట్టెక్కింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాండ్యా బ్రదర్స్, ఇషాన్ కిషన్, క్వింటన్ డికాక్, పొలార్డ్ వైఫల్యం జట్టును దెబ్బతీస్తుందని కామెంట్ చేస్తున్నారు. ఇంకా నయం దీపక్ హుడా బ్యాటింగ్‌కు రాలేదని లేకుంటే కృనాల్‌కు చుక్కలు కనబడేవని కామెంట్ చేస్తున్నారు.
దేవన్నా.. ఆ శంకర్ గాడికి కొంచెం మంచి ఫుడ్ పెట్టు.. ఢిల్లీతో హాఫ్ సెంచరీ కొట్టాలి నాయాల్ది!
పాండ్యా బ్రదర్స్‌ను పక్కన పెట్టండి..
ప్రతీ సీజన్‌లో సూపర్ పెర్ఫామెన్స్ కనబర్చే పాండ్యా బ్రదర్స్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క మెరుపు ప్రదర్శన చేయలేదు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ కృనాల్ పాండ్యా తేలిపోతున్నాడు. స్పిన్ వికెట్‌పై కూడా ధారళంగా పరుగులిస్తూ జట్టు ఓటమికి కారణం అవుతున్నాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సహచర స్పిన్నర్లంతా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే కృనాల్ ఒక్కడే భారీ పరుగులిచ్చుకున్నాడు. దాంతో అతన్ని పక్కన పెట్టాలని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కేవలం బ్యాటింగ్‌కు పరిమితమైన హార్దిక్ పాండ్యాతో జట్టుకు ఒరిగేదేం లేదంటున్నారు. ఐదు మ్యాచ్‌ల్లో అతను దారుణంగా విఫలమయ్యాడని గుర్తు చేస్తున్నారు. కొన్ని మ్యాచ్‌లు పక్కనపెడితే సెట్ అవుతాడని సలహాలిస్తున్నారు.
క్రిస్‌లిన్ తీసుకురండి..
ఇక ఫస్ట్ మ్యాచ్‌లో 49 రన్స్‌తో రాణించిన క్రిస్ లిన్‌ను క్వింటన్ డికాక్ చేరికతో పక్కనపెట్టిన ముంబై భారీ మూల్యం చెల్లించుకుంది. అతను ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. గత సీజన్‌లో మంచి ఆరంభాలు అందించిన డికాక్ ఈ సీజన్‌లో పూర్తిగా తేలిపోతున్నాడు. ఇది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అతని స్థానంలో క్రిస్ లిన్‌కు అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రోహిత్, క్రిస్ లిన్ మధ్య సంభాషణలను ఊహిస్తూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. రోహిత్ ఒకసారి ఇటు చూడంటూ క్రిస్ లిన్ అన్నట్లు ఉన్న మీమ్స్ షేర్ చేస్తున్నారు.
అంబానీ రంగంలోకి దిగాల్సిందే..
ముంబై బ్యాక్ టు బ్యాక్ ఓటములను ఆ టీమ్ హేటర్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సారి అంబానీ లాబీయింగ్ పనిచేయడం లేదనుకుంటా.. టీమ్ వరుసగా ఓడిపోతుందని సెటైర్లు పేల్చుతున్నారు. అంబానీ రంగంలోకి దిగి అంపైర్లను కొనేయాలనే మీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇక సూపర్ ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్(52 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 నాటౌట్), క్రిస్ గేల్(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 నాటౌట్)లపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 రన్స్ చేసింది. రోహిత్ శర్మ(52 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63), సూర్యకుమార్ యాదవ్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 33) మినహా అంతా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ(2/21), రవి బిష్ణోయ్(2/21) రెండేసి వికెట్లు తీయగా.. దీపక్ హుడా, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీశారు. అనంతరం పంజాబ్ కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 132 రన్స్ చేసి సునాయస విజయాన్నందుకుంది.


Click it and Unblock the Notifications

ఆ తప్పిదమే మా కొంపముంచింది: రోహిత్ శర్మ