Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ విలువ రూ.20 వేల కోట్లు! ఆర్‌సీబీ, SRH విలువ ఎంతంటే..?

అత్యధిక విలువ కలిగిన ఐపీఎల్ ఫ్రాంచైజీగా ముంబై ఇండియన్స్ నిలిచింది. స్పోర్టికో రిపోర్ట్ ప్రకారం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ విలువ రూ.20,008.8 కోట్లకు చేరుకుంది. ఈ నివేదిక ప్రకారం ఐపీఎల్‌లో ప్రతీ ఫ్రాంచైజీ విలువ రూ.14,292 కోట్ల కంటే ఎక్కువగా ఉంది.

ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) అత్యధికంగా చెరో ఐదు ట్రోఫీలను గెలుచుకోగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మూడు టైటిళ్లను అందుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) చెరో 2 సార్లు ట్రోఫీని అందుకున్నాయి.

స్పోర్టికో రిపోర్ట్ ప్రకారం రూ.20 వేల కోట్లతో అత్యధిక విలువ కలిగిన ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ రికార్డ్ సాధించింది. రూ.17,626 కోట్ల విలువతో ఆర్‌సీబీ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. సీఎస్‌కే రూ.16,674 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.

IND vs NZ: ప్రాక్టీస్‌లో శుభ్‌మన్ గిల్ కణతపై సరికొత్త పరికరం.. అసలు ఏంటిది ఇది?

IND vs NZ: ప్రాక్టీస్‌లో శుభ్‌మన్ గిల్ కణతపై సరికొత్త పరికరం.. అసలు ఏంటిది ఇది?

కేకేఆర్(రూ.16,483.44 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్(రూ.16,976 కోట్లు), రాజస్థాన్ రాయల్స్(రూ.15,721.2 కోట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ.15,435.35 కోట్లు), గుజరాత్ టైటాన్స్(రూ.15,054.24 కోట్లు), పంజాబ్ కింగ్స్(రూ.14,577.84 కోట్లు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

Mumbai Indians Emerge as IPL s Most Valuable Franchise at Rs 20 000 Crore Where Do RCB and SRH Rank

అరంగేట్ర 2008 సీజన్‌తో పోల్చితే ఐపీఎల్ విలువ 1800 శాతం పెరిగింది. ఈ కాలంలో ఎన్‌బీఏ లీగ్ విలువ 1700 శాతం మాత్రమే పెరగడం గమనార్హం. ఐపీఎల్ జట్ల ఆదాయంలో బ్రాడ్‌కాస్టర్స్ రెవెన్యూనే అధిక భాగం. టీవీ, ఓటీటీ రైట్స్ ఐపీఎల్‌కు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల ద్వారానే ప్రతీ టీమ్ రూ.476.4 కోట్ల నుంచి రూ.523 కోట్లు సంపాదిస్తున్నాయి.

IND vs NZ: ఆ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు: తిలక్ వర్మ

Also Read

IND vs NZ: ఆ విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు: తిలక్ వర్మ

ఐపీఎల్ ప్రసారా హక్కుల ద్వారా వచ్చే ఆదాయంలో లీగ్ వ్యయం పోగా సగ భాగాన్ని బీసీసీఐ ఉంచుకుంటుంది. మిగతా సగభాగంలోని 90 శాతాన్ని 10 జట్లకు సమానంగా పంచుతారు. మిగలిన 10 శాతం ఆదాయాన్ని ప్రతి జట్టు ప్రదర్శనను బట్టి ఇస్తారు. అదేవిధంగా.. ప్రతీ టీమ్ టికెట్ల అమ్మకాలు, స్పాన్సర్‌షిప్, ప్రకటనల ద్వారానే రూ.708.9 కోట్లు సంపాదిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన లీగ్‌గా ఐపీఎల్ నిలిచింది. ప్రతీ సీజన్‌లో ప్రతీ టీమ్ కనీసం 30 శాతం లాభాలను సొంతం చేసుకుంటుంది.

Story first published: Thursday, October 29, 2026, 17:54 [IST]
Other articles published on Oct 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+