IPL 2027: ముంబై ఇండియన్స్‌లో మార్పులు.. తెలుగోడికి కీలక పదవి!
ఐపీఎల్ 2027 సీజన్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ తమ కోచింగ్ స్టాఫ్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసింది. ఇప్పటికే హెడ్ కోచ్‌గా కీరన్ పోలార్డ్‌ను నియమించిన ముంబై ఇండియన్స్.. సపోర్ట్ స్టాఫ్ మెంబర్స్ కూడా మార్చేసింది. సుదీర్ఘ కాలం జట్టుకు సేవలందించిన మహేళ జయవర్దనేతో పాటు లసిత్ మలింగా, పరాస్ మాంబ్రే, కార్ల్ హప్‌కిన్సన్‌లకు వీడ్కోలు పలికిన ముంబై మేనేజ్‌మెంట్.. వారి స్థానాల్లో కొత్తవారిని నియమించింది.
బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పను ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. బౌలింగ్ డెవలప్‌మెంట్ కోచ్‌గా ధావల్ కులకర్ణి, బౌలింగ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మిచెల్ మెక్‌క్లెనగన్, ఫీల్డింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ కోచ్, తెలుగు తేజం టీ దిలీప్‌లను నియమించింది. ఈ మేరకు ముంబై ఇండియన్స్ శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇందులో మిచెల్ మెక్‌క్లెనగన్, ధావల్ కులకర్ణి, రాబిన్ ఊతప్ప గతంలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించడం విశేషం.

ముంబై సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టుల్లో కొత్త కోచింగ్ స్టాఫ్‌కు స్వాగతం పలికింది. ముందుగా రాబిన్ ఊతప్పకు స్వాగతం పలుకుతూ.. 'తొలి సీజన్ నుంచి మా ప్రయాణంలో భాగమై.. ఇప్పుడు అపారమైన అనుభవంతో జట్టులోకి తిరిగి వస్తున్నారు. రాబిన్ ఊతప్పకు ఆటపై మంచి అవగాహన, అద్భుతమైన కమ్యూనికేషన్, యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేసే సామర్థ్యం ఉంది. ముంబై జట్టులోకి తిరిగి స్వాగతం. రాబిన్ ఊతప్ప మా నయా బ్యాటింగ్ కోచ్'అని క్యాప్షన్‌గా పేర్కొంది.
'మిచెల్ మెక్‌క్లెనగన్ తిరిగి సొంత గూటికి చేరాడు. అతను అభిమానుల ప్రియమైన ఆటగాడు.'అని తెలిపింది. అయితే అతని రోల్ ఏంటనే విషయాన్ని ప్రస్తావించలేదు. భారత జట్టు సాధించిన మూడు ఐసీసీ టైటిళ్ల నుంచి.. అద్భుతమైన ఫీల్డింగ్ మెడల్ వేడుకల క్షణాల వరకు టీకే దిలీప్ తన శక్తి, ఉత్సాహంతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు అదే జోష్‌తో ఫీల్డింగ్ కోచ్‌గా ముంబై జట్టులోకి వస్తున్నారు. ముంబై లోకల్ బిడ్డ, దేశవాళీ క్రికెట్ దిగ్గజం.. ఇప్పుడు మా డెవలప్‌మెంట్ బౌలింగ్ కోచ్‌గా తిరిగి వస్తాడు.'అని ముంబై ఇండియన్స్ తన పోస్ట్‌ల్లో పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


