భారత క్రికెట్ వెలుగు అతడు.. ఆ మహిమలు మళ్లీ గుర్తు తెచ్చుకోవాల్సిందే!
అతడు రాగానే ఆటకు ఊపొచ్చింది..! మసకబారుతున్న భారత క్రికెట్‌కు వెలుగొచ్చింది..! చేజారుతున్న మ్యాచ్‌లు గెలవొచ్చనే ధీమా వచ్చింది..! మూడు దశాబ్దాలుగా ఊరిస్తొన్న వరల్డ్‌కప్ చేతుల్లోకొచ్చింది.! టీమిండియా అంటే స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ పంజా విసరగలదని ప్రత్యర్థులకు తెలిసొచ్చింది.!
అతని 'మహి'మలు ఒకటా రెండా.. అనుకున్నదే తడువుగా సిక్సర్లు కొట్టేసినా.. రెప్పపాటులో స్టంపింగ్స్ చేసినా.. వికెట్లను చూడకుండానే రనౌట్లు చేసినా.. ఇప్పటికీ ఎందరికో అంతుచిక్కని డీఆర్ఎస్‌ను ధోనీ రివ్యూ సిస్టమ్ అనేట్టుగా మార్చేసినా.. సరికొత్త ఆలోచనలతో అద్భుతాలు సృష్టించినా అతనికే చెల్లింది.
అంతేనా.. కుర్రాళ్ల ఆటగా ముద్రపడ్డ ఐపీఎల్‌లో 'డ్యాడ్స్ ఆర్మీ'తో మూడుసార్లు టైటిల్ కొట్టి లీగ్‌లో చెన్నైని మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్‌గా మార్చేసినా.. ఎంతో మంది కుర్రాళ్లను చాంపియన్లుగా తీర్చిదిద్దినా.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ భారత్‌కు టీ20, వన్డే, వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించినా.. అతనికే సాధ్యమైంది.
ఈ మహిమల ఇంద్రజాలికుడు.. ఇండియా క్రికెట్ దార్శనికుడు.. మహేంద్ర సింగ్ ధోనీ నేటి(జూలై 7) తో 45వ ఏట అడుగెడుతున్న సందర్భంగా ఈ భారత డైనమైట్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ ప్రత్యేక కథనం.!

గోల్డెన్ డకౌట్‌తో మొదలై..
సౌరవ్ గంగూలీ సారథ్యంలో 2004లో బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ జార్ఖండ్ డైనమైట్ జర్నీ గోల్డెన్ డకౌట్‌తో మొదలైనా.. తర్వాత దేశ క్రికెట్ గతినే మార్చే స్థాయికి చేరింది. అన్ని ఫార్మాట్లలో కలిపి 17266 రన్స్ చేసిన 39 ఏళ్ల మహీ తన 16 ఏళ్ల కెరీర్‌లో 350 వన్డేలు, 90 టెస్ట్‌లు, 98 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 829 ఔట్లలో పాలుపంచుకొని వరల్డ్ బెస్ట్ కీపర్లలో ఒకడిగా ఇండియా బెస్ట్‌గా నిలిచాడు.
ఆ సిక్స్ ధోనీ కెరీర్‌కే హైలైట్..
ఒత్తిడిలో మరింత కూల్‌గా ఉండే ధోనీ కెప్టెన్‌గా ఎన్నో ఘనతలు సాధించాడు. అతని సారథ్యంలో పరిమిత ఓవర్లలో ఇండియా తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2007లో టీ20 ప్రపంచకప్ సాధించి దేశ క్రికెట్‌కు సరికొత్త బాట చూపిన ఈ రాంచీ వీరుడు.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో పాటు చిరకాలం గుర్తుండిపోయే సిక్సర్‌తో 2011 ప్రపంచకప్‌తో యావత్ దేశం ఉప్పొంగేలా చేశాడు.
ఏకైక సారథిగా..
2013లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా సాధించి ఐసీసీ మూడు మేజర్ టైటిళ్లు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా అందరి ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు టెస్టులు, వన్డేల్లో భారత్‌కు నంబర్ వన్ ర్యాంక్ సాధించిపెట్టాడు. ఐపీఎల్‌లోనూ మహేంద్రుడిదే హవా. అతని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐదు టైటిల్స్ అందుకుంది. ఛాంపియన్స్ లీగ్‌లోరెండు సార్లు విజేతగా నిలిచింది.
2014లోనే టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన ధోనీ.. 2019 వన్డే ప్రపంచకప్‌తో అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ధోనీ రనౌట్ అయిన తీరు ఇప్పటికీ అభిమానుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. ధోనీ రనౌట్ కాకపోయి ఉంటే మ్యాచ్ గెలిపించేవాడని దేశం మొత్తం భావించింది. విచిత్రం ఏంటంటే రనౌట్‌తో మొదలైన ధోనీ ప్రయాణం.. రనౌట్‌తోనే ముగిసింది. ఈ ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్ తర్వాత భారత జట్టుకు దూరంగా ఉన్న ధోనీ.. 2020 ఆగస్ట్ 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

