Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సీఎస్‌కేతో వాటా వివాదం.. ధోనీ ఆస్తులు విలువ ఎంతంటే..?

క్రికెట్ చాలా మంది ఆటగాళ్ల జీవితాలను మార్చేసింది. కూటికి గతిలేని వ్యక్తులను కూడా కోటీశ్వరులను చేసింది. సాధారణ రైల్వే టికెట్ ఇన్‌‌స్పెక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన టీమిండియా దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ.. ప్రపంచంలో అత్యంత ధనవంతమైన క్రీడాకారుల్లో ఒకడిగా ఎదిగాడు. కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా.. దాన్ని తెలివిగా రెట్టింపు చేశాడు.

చాలా మంది క్రీడాకారులు.. కష్టపడి సంపాదించిన డబ్బును వృథా చేస్తుండగా.. ధోనీ మాత్రం చాలా తెలివిగా తన సంపాదనను రెట్టింపు చేస్తున్నాడు. తెలివిగా పెట్టుబడులు పెడుతూ.. మంచి వ్యాపారవేత్తగా మారాడు. తన పెట్టుబడులను సాంప్రదాయ క్రీడా సంస్థల నుంచి డ్రోన్స్, ఎలక్ట్రిక్ వావానాలు, ఫిన్‌టెక్, క్రియేటర్ ఎకానమీ, ప్లాంట్ ప్రోటీన్ ఉత్పత్తులు, డిజిటిల్ ఇన్సూరెన్స్ వరకు విస్తరించాడు. వీటిలో కొత్త కంపెనీల్లో ప్రారంభ దశ పెట్టుబడులు, ఈక్వీటీతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందాలు కూడా ఉన్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్‌తో ధోనీకి విభేదాలు..?

చెన్నై సూపర్ కింగ్స్‌తో ధోనీకి విభేదాలు..?

సీఎస్‌కేతో వాటా వివాదం..

తన ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్‌లో వాటా కొనుగోలు చేసేందుకు ధోనీ ప్రయత్నించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. సీఎస్‌కే యాజమాన్యం, ధోనీ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విభేదాలు తలెత్తయానే ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై ధోనీ, సీఎస్‌కే యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సీఎస్‌తో వాటాల వివాదం నేపథ్యంలో ధోనీ పెట్టుబడులు చర్చనీయాంశమయ్యాయి.

MS Dhoni Investments From Cars24 and Khatabook to Garuda Aerospace and EMotorad

1. చెన్నై ఎఫ్‌సీ

చెన్నై ఎఫ్‌సీ ఫుట్‌బాల్ టీమ్‌కు ధోనీ కో-ఓనర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2014 అక్టోబర్‌లో అతను ఈ జట్టు యజమాన్యంలో భాగమయ్యాడు. చెన్నై ఎఫ్‌సీ 2015, 2017-18లో ఐఎస్‌ఎల్ టైటిల్స్ గెలిచింది.

2. రాంచీ రేస్..

హాకీ ఇండియా లీగ్‌లో రాంచీకి చెందిన రాంచీ రేస్ జట్టును 2014 ధోనీ కొనుగోలు చేశాడు.

3. మహీ రేసింగ్ టీమిండియా..

మోటార్ సైకిళ్లపై అమితమైన ప్రేమ చూపించే ధోనీ.. 'మహీ రేసింగ్ టీమిండియా' అనే జట్టును ఏర్పాటు చేశాడు. సూపర్ స్పోర్ట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ సిరీస్‌లో పోటీపడిన ఈ జట్టు.. అతను ప్రారంభించిన తొలి క్రీడా-వ్యాపార ప్రయత్నల్లో ఒకటి.

4.సెవెన్

ధోనీ తన జెర్సీ నెంబర్ 7ను బ్రాండ్‌గా మార్చాడు. సెవెన్ పేరిట ఫిట్‌నెస్ దుస్తులు, షూస్, ఇతర జీవన శైలి ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.

IPL 2027: ధోనీతో పాటు ఆ ఐదుగురు ఔట్.. సీఎస్‌కే వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!

Also Read

IPL 2027: ధోనీతో పాటు ఆ ఐదుగురు ఔట్.. సీఎస్‌కే వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!

5. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్..

ధోనీ ఎంటర్‌టైర్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. పలు చిత్రాలను కూడా తెరకెక్కించాడు. నాణ్యమైన ఉత్పత్తుల కోసం ఈ సంస్థ బనిజయ ఆసియాతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

6. 7 ఇంక్ బ్రూస్-కాప్టర్ 7:

ధోనీ యొక్క ప్రసిద్ధ హెలికాప్టర్ షాట్, జెర్సీ నంబర్ 7 కలిసొచ్చే కాప్టర్ 7 బ్రాండ్ కింద ఉత్పత్తులను ప్రారంభించిన 7 ఇంక్ బ్రూస్ అనే కంపెనీకి ధోనీ భాగస్వామిగా.. బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు.

7. కార్స్ 24

2019లో యూజ్డ్ కార్ ప్లాట్‌ఫామ్ కార్స్ 24లో పెట్టుబడి పెట్టి.. దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. భారతీయ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో అతను పెట్టిన తొలి ప్రధాన పెట్టుబడి.

8. గరుడ ఏరోస్పేస్..

చెన్నైకి చెందిన డ్రోన్ టెక్నాలజీ కంపెనీ గురుడ ఏరోస్పేస్‌తో ధోనీకి ఉన్న అనుబంధం 2022లో మొదలైంది. ధోనీ ఈకంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌‌గా ఉంటూనే కో ఇన్విస్టర్‌గా వ్వవహరించాడు.

9. ఖాతాబుక్..

చిన్నవ్యాపారాలు తమ ఖాతాలను, లావాదేవీలను సులుభంగా నిర్వహించుకోవడానికి సహాయపడే ఫిన్‌టెక్ ఫ్లాట్‌ఫామ్ అయిన ఖాతా బుక్‌లోనూ ధోనీ పెట్టుబడి పెట్టి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు.

10 షాకా హ్యారీ, హోమ్‌లేన్

సాంప్రదాయ మాంసం ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా మొక్కల ఆధారిత ప్రోటీన్ ఆహారాలను అందించే బెంగళూరుకు చెందిన షాకా హ్యారీ కంపెనీలో ధోనీ పెట్టుబడి పెట్టాడు. టెక్నాలజీ ఆధారిత హోమ్ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ అయిన హోమ్ లేన్‌తో కూడా జతకట్టాడు. వీటితో పాటు ఫ్యామిలీ ఆఫీస్, మిడాస్ డీల్స్, డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ అకోలో పెట్టుబడి పెట్టాడు. ధోనీ నికర ఆస్తి విలువ దాదాపు రూ. 1200 కోట్లు ఉంటుందని అంచనా.

Story first published: Wednesday, August 26, 2026, 20:14 [IST]
Other articles published on Aug 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+