Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: ధోనీతో పాటు ఆ ఐదుగురు ఔట్.. సీఎస్‌కే వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా నిరాశపర్చింది. పేలవమైన ఆటతీరుతో 14 మ్యాచ్‌ల్లో 6 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో 8వ స్థానంలో నిలిచింది. ఆటగాళ్ల గాయాలు.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గైర్హాజరీ‌తో పాటు ఓవర్‌సీస్ ఆటగాళ్ల వైఫల్యం సీఎస్‌కే పతనాన్ని శాసించింది. బౌలింగ్ వైఫల్యం కూడా జట్టు ఓటములకు కారణమైంది.

IPL 2027: కేకేఆర్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా!

IPL 2027: కేకేఆర్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా!

ఈ క్రమంలోనే వచ్చే సీజన్‌‌కు ఈ బలహీనతల్లేని బలమైన జట్టును సిద్దం చేయడంపై సీఎస్‌‌ ఫోకస్ పెట్టింది. ఐపీఎల్ 2027 మినీ వేలం ఈ ఏడాది నవంబర్‌లో లేదా డిసెంబర్ తొలి వారంలో జరిగే అవకాశం ఉంది. జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లను సీఎస్‌కే వదిలేయాలనుకుంటుంది. ముఖ్యంగా ఐదుగురు ఆటగాళ్లను సీఎస్‌కే రిలీజ్ చేయనుంది.

CSK Could Release These Five Players Including MS Dhoni Ahead of IPL 2027 Mini Auction

1. మహేంద్ర సింగ్ ధోనీ..

ఐపీఎల్ 2027 సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఆడుతాడా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు. అటు ఫ్రాంచైజీ కానీ ఇటు ధోనీ కానీ స్పష్టత ఇవ్వలేదు. మోకాలి గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రస్తుతం ధోనీ వయసు 45 ఏళ్ల. వచ్చే ఏడాది అతను ఆడటం కష్టంగానే కనిపిస్తోంది. సీఎస్‌కే మెంటార్‌గా ధోనీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అదే జరిగితే.. సీఎస్‌కే రిలీజ్ లిస్ట్‌లో ధోనీ పేరు ముందువరుసలో ఉండనుంది.

IPL 2027: ఆ ఐదుగురికి గుడ్‌బై.. ఆర్‌సీబీ వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!

Also Read

IPL 2027: ఆ ఐదుగురికి గుడ్‌బై.. ఆర్‌సీబీ వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!

2. శివమ్ దూబే

బ్యాటింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేకు సీఎస్‌కే ఉద్వాసన పలకవచ్చు. హార్దిక్ పాండ్యా కోసం సీఎస్‌కే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ట్రేడ్ డీల్ కోసం చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. హార్దిక్ కోసం శివమ్ దూబేను వదులుకునేందుకు సీఎస్‌కే సుముఖత వ్యక్తం చేసినట్లు కూడా తెలిసింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో శివమ్ దూబే ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. 13 మ్యాచ్‌ల్లో 270 పరుగులు చేసినా.. బౌలింగ్‌లో 5 ఓవర్లు మాత్రమే వేసి ఒక్క వికెట్ మాత్రమే తీసాడు. ఆల్‌రౌండర్ పాత్రను సరిగ్గా పోషించడం లేదు.

3. ఖలీల్ అహ్మద్

తరుచూ గాయాలతో ఇబ్బంది పడే ఖలీల్ అహ్మద్‌కు కూడా సీఎస్‌కే గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై ఓటములకు ఖలీల్ అహ్మద్ ప్రధాన కారణమయ్యాడు. గాయంతో సీజన్ మధ్యలోనే తప్పుకున్న అతను ఐదు మ్యాచ్‌లు 8.60 ఎకానమీతో రెండు వికెట్లు మాత్రమే తీసాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి మరో ఇండియన్ పేసర్‌ను తీసుకోవాలనే ఉద్దేశంలో సీఎస్‌కే ఉంది.

IPL 2027: ఆ ఐదుగురు ఔట్.. ముంబై ఇండియన్స్ వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!

Recommended For You

IPL 2027: ఆ ఐదుగురు ఔట్.. ముంబై ఇండియన్స్ వదిలేసే ఆటగాళ్ల జాబితా ఇదే!

4. ప్రశాంత్ వీర్

రూ.14.20 కోట్ల భారీ ధరతో జట్టులోకి వచ్చిన ఈ యువ ఆల్‌రౌండర్ అంచనాలను అందుకోలేకపోయాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో 6 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 45 సగటుతో 90 పరుగులే చేశాడు. బౌలింగ్‌లో 2 ఓవర్లు వేసి 12.50 ఎనామీతో పరుగులిచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి ఇండియన్ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేయాలని సీఎస్‌కే భావిస్తోంది.

5. డెవాల్డ్ బ్రెవిస్

ఈ సౌతాఫ్రికా యువ బ్యాటర్‌ను కూడా సీఎస్‌కే వదిలేయనుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన బ్రెవిస్ 18.88 సగటుతో 151 పరుగులే చేశాడు. అతని వైఫల్యం జట్టు పతనాన్ని శాసించింది. ముఖ్యంగా మిడిలార్డర్‌ను బలహీనంగా మార్చింది. ఈ క్రమంలోనే అతన్ని వేలంలోకి వదిలేసి కత్తిలాంటి ఓవర్‌సీస్ ఆటగాడిని కొనుగోలు చేయాలని సీఎస్‌కే భావిస్తోంది.

Story first published: Thursday, August 6, 2026, 19:59 [IST]
Other articles published on Aug 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+