సుక్కా, ముక్కా.. హుక్కా! తాగి ఊగిన రిషభ్ పంత్, ధోనీ?(వీడియో)
భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ధోనీతో పాటు రిషభ్ పంత్ తమ స్నేహితులతో కలిసి గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. సుక్కా, ముక్కా.. హుక్కాతో ఛిల్ అయినట్లు అర్థమవుతోంది.
ఈ పార్టీ ఎప్పుడు ఎక్కడ జరిగిందనేదానిపై స్పష్టమైన సమాచారం లేదు. కానీ ఈ వీడియోలో రిషభ్ పంత్ సోయిలో లేకుండా అరుస్తుండటం కనిపించింది. అతనికి మందు బాగా ఎక్కువైనట్లు అర్థమవుతోంది. అంతే కాకుండా ఎవరో ఒకరు ఇప్పుడే హుక్కా తాగి వస్తా అని అన్న మాటలు వినిపించాయి. దాంతో ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది.
హుక్కా తాగింది ధోనీనేనా..?
ఈ వీడియోలో హుక్కా గురించి మాట్లాడింది ఎవరనేది తెలియనప్పటికీ.. అభిమానులు మాత్రం ధోనీనే అన్నాడని కామెంట్ చేస్తున్నారు. అక్కడి సంభాషణ కూడా ధోనీనే ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ఉంది. రిషభ్ పంత్.. ధోనీ భాయ్.. ధోనీ భాయ్ అని గట్టిగా అరుస్తూ ఇక్కడికి రా అని పిలిచాడు. అతని దగ్గరకు వచ్చిన ధోనీ.. హుక్కా తాగి వస్తా అని అన్నట్లు వీడియోలో కనిపించింది. అయితే ఈ వీడియోలోని మాటలు నిజమా? లేక కల్పితమా? అనేది తేలాల్సి ఉంది.

ధోనీకి హుక్కా తాగే అలవాటు ఉందని గతంలో చాలా మంది క్రికెటర్లు తెలిపారు. పలు పర్యటనల సమయంలో ధోనీ తన గదిలో హుక్కా సెటప్ చేసుకొని, యంగ్ ప్లేయర్లతో సరదాగా మాట్లాడేందుకు ఎప్పుడూ ఓపెన్ డోర్ పాలసీ పాటించేవాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జార్జ్ బెయిలీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ధోనీ రికార్డ్ బద్దలు చేయడంతోనే..
శ్రీలంక పర్యటనలో రిషభ్ పంత్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ఓవర్‌సీస్ కండిషన్స్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ధోనీ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. విదేశాల్లో ధోనీ 2496 పరుగులు చేయగా.. రిషభ్ పంత్ 2534 రన్స్ సాధించాడు. ఫరూక్ ఇంజనీర్(1209), సయ్యద్ కిర్మాణి(1109), కిరణ్ మోరే(901) తదుపరి స్థానాల్లో ఉన్నారు.
ధోనీ రికార్డ్‌ను బద్దలు చేయడంతోనే రిషభ్ పంత్ ఈ పార్టీ ఇచ్చి ఉంటాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి వికెట్ కీపర్‌గా కూడా పంత్ నిలిచాడు. ఈ క్రమంలో అతను గిల్‌క్రిస్ట్‌ను అధిగమించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

