For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆంటీ.. నేను ధోనీని మాట్లాడుతున్నా..

MS Dhoni First Sponsor Somi Kohli Says Sports dealer tried to convince me for 6 months about a boy from Ranchi

న్యూఢిల్లీ: కెరీర్‌ ఆరంభంలో చాలా మందిలాగే బ్యాట్‌ స్పాన్సర్‌షిప్‌ కోసం మహేంద్ర సింగ్ ధోని కూడా బాగా ఇబ్బందులు పడ్డాడు. రాంచీలోని ఓ క్రికెట్ కిట్ డీలర్‌ పరమ్‌జిత్‌ సింగ్‌ అతనిలోని ప్రతిభను గుర్తించి ఆరు నెలల పాటు BAS (బీట్‌ ఆల్‌ స్పోర్ట్స్‌) కంపెనీ వెంట పడటంతో చివరకు జలంధర్‌కు చెంది ఆ సంస్థ యజమాని సోమి కోహ్లీ అందుకు అంగీకరించాడు. అప్పటి నుంచి సోమి కోహ్లీ.. ధోనీకి బ్యాట్‌లు అందజేశాడు. అయితే శనివారం మహీ రిటైర్మెంట్ ప్రకటించడంతో సోమి కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. ధోనీతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నాడు. అలాగే కెరీర్ ప్రారంభంలో తన భార్య ధోనీ‌ని ఎవరని ప్రశ్నించిందని, దాంతో అతను తీవ్రంగా బాధపడ్డాడని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్‌పై ఫస్ట్ సెంచరీ చేసిన అనంతరం ఫోన్ చేసిన తన భార్యతో మాట్లాడాడని చెప్పుకొచ్చాడు.

6నెలలు విసిగిస్తే..

6నెలలు విసిగిస్తే..

‘క్రికెట్ ఉత్పత్తుల కంపెనీ ఉన్న మేం యువ ఆటగాళ్లను ప్రోత్సహించేవాళ్లం. ఈ నేపథ్యంలోనే డీలర్ పరమ్ జీత్ సింగ్ రాంచీ ఓ యువ ఆటగాడున్నాడని, అతనికి స్పాన్సర్ చేయాలని పట్టుబట్టాడు. ఆరు నెలల తర్వాత 1998 ఫిబ్రవరిలో ధోనీకి తొలిసారి కిట్స్ పంపించాం. అతనితో మాకు 22 ఏళ్ల బంధం ఉంది. ఇక ధోనీ రిటైర్మెంట్ వార్తను నేను ముందుగా నమ్మలేదు. తర్వాత నిద్ర కూడా పట్టలేదు. అతనో అద్భుత ఆటగాడు. అతన ఆటలో మా కంపెనీ బాగస్వామ్యం కావడం మేం చేసుకున్న అదృష్టం'అని చెప్పుకొచ్చాడు.

హలో ధోనీ ఫ్యాన్స్.. మీవోడి ఫస్ట్ వికెట్ నేను కాదు: కెవిన్ పీటర్సన్

 నా భార్య మాటలతో బాధపడ్డాడు..

నా భార్య మాటలతో బాధపడ్డాడు..

‘1998లోనే ధోనితో మా సంస్థ ప్రయాణం మొదలు కాగా ఆరేళ్ల తర్వాత గానీ ధోనీ భేటీ జరగలేదు. ఇన్నాళ్లు మాట్లాడుకున్నా ఎప్పుడూ కలవలేదు. 2004లో ఒక సారి బ్యాట్‌లను ఎంచుకునేందుకు జలంధర్‌‌లో మా ఫ్యాక్టరీకి వచ్చిన ధోని ఆ రాత్రి మా ఇంట్లోనే ఉండిపోయాడు. ధోనిని నా భార్యకు పరిచయం చేయగా...ఆమె ‘ఎవరితను' అని ఎదురు ప్రశ్నించింది. తర్వాతి రోజు ఉదయం ధోని ‘సర్, ఆమె మాటలతో నేను రాత్రంతా నిద్రపోలేకపోయాను' అని నాతో చెప్పాడు. కొన్ని నెలల తర్వాత వైజాగ్‌లో పాకిస్తాన్‌పై అద్భుత సెంచరీ చేసిన తర్వాత అదే రోజు రాత్రి 11 గంటలకు నాకు ఫోన్‌ చేసి మా ఆవిడతో మాట్లాడుతానన్నాడు. నేను మా ఆవిడకు ఫోన్ ఇవ్వగా.. ‘ఆంటీ, నేను ధోనిని మాట్లాడుతున్నా'అన్నాడు. ‘బిడ్డా, ఇప్పుడు నేనే కాదు ప్రపంచమంతా నిన్ను గుర్తిస్తుంది'అని మా ఆవిడ ఆశీర్వదించింది.'అని సోమి కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.

 ధోనీ బ్యాట్ ప్రత్యేకం..

ధోనీ బ్యాట్ ప్రత్యేకం..

‘ఇతర ఆటగాళ్లలా కాకుండా ధోనీ ప్రత్యేకమైన బ్యాట్‌తో ఆడేవాడు. ఒవల్ హ్యాండిల్‌తో పాటు అతని బ్యాట్ వెనుకాల బరువెక్కువగా ఉంటుంది. క్రికెట్‌లో ఆటగాళ్లకు బ్యాట్ వెపన్‌లాంటింది. వారికి అనుగుణంగా మేం బ్యాట్‌లు తయారు చేసి ఇచ్చేవాళ్లం. 2009లో నేను ధోనీ రూమ్‌లో ఉండగా.. సచిన్, యువరాజ్ వచ్చారు. సచిన్‌‌కు మంచి బ్యాట్ చేసి ఇవ్వాలని యువీ కోరడంతో తయారు చేసి ఇచ్చాం. ఆ బ్యాట్‌తోనే సచిన్ ఆస్ట్రేలియాతో సెంచరీ, సౌతాఫ్రికాపై డబుల్ సెంచరీ చేశాడు.

 ధోనీ ఓ కొహినూర్ వజ్రం..

ధోనీ ఓ కొహినూర్ వజ్రం..

గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌‌కు ముందు ధోనీ బ్లూ కలర్‌లోని (BAS)బాస్ లోగోస్ అడిగాడు. పలు బ్రాండ్ల ఒప్పందాలతో ధోనీ కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ అతనికి చేసిన సాయానికి కృతజ్ఞతగా బాస్ లోగోలతో బరిలోకి దిగాడు. అతను భారత క్రికెట్ కొహినూర్ వజ్రం'అని సోమి కోహ్లీ కొనియాడాడు. బాస్ తర్వాత ప్రముఖ కంపెనీలతో ధోనీ ఒప్పందాలు కుదుర్చుకున్నా ఆ కంపెనీ మాత్రం బ్యాట్లు పంపడం ఆపలేదు. గత ఏడాది ప్రపంచకప్‌లో తనకు అండగా నిలిచిన అన్ని కంపెనీల లోగోలు కనిపించే విధంగా వేర్వేరు బ్యాట్లతో ఆడి ధోని తన కృతజ్ఞతను ప్రదర్శించాడు.

ధోనీ ఓ మోసగాడు.. మమ్మల్ని నట్టేట ముంచేసాడు: ఆమ్రపాలి బాధితులు

Story first published: Tuesday, August 18, 2020, 15:02 [IST]
Other articles published on Aug 18, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+