Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG తొలి వన్డేలో ధోనీ సందడి.. ముసలోడిని అయిపోయా అంటూ సైగలు! (వీడియో)

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సందడి చేశాడు. ప్రేక్షకుడిగా ఈ మ్యాచ్‌కు హాజరై ఆటను ఆస్వాదించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పలువురు చిన్నారులతో కలిసి ధోనీ ఈ మ్యాచ్ వీక్షించాడు.

IND vs ENG: గెలికి మరీ తన్నించుకోవడం అంటే ఇదే బ్రో! (వీడియో)

IND vs ENG: గెలికి మరీ తన్నించుకోవడం అంటే ఇదే బ్రో! (వీడియో)

ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ధోనీ.. వారం క్రితమే 45వ పుట్టినరోజును అక్కడే జరుపుకున్నాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌కు కూడా హాజరయ్యాడు. ఈ మ్యాచ్ సందర్భంగా ధోనీని బిగ్ స్క్రీన్‌పై చూసిన ప్రేక్షకులు ధోనీ ధోనీ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. కొంతమంది ప్రేక్షకులు మళ్లీ బ్యాటింగ్ చేయాలని ధోనీని కోరగా.. సరదాగా స్పందించాడు. తాను ముసలోడినయ్యానని, పరుగెత్తలేనని గడ్డం చూపిస్తూ సైగలు చేశాడు. ఈ వీడియో అప్పట్లో నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది.

MS Dhoni Attends India vs England 1st ODI at Edgbaston Viral Video Delights Fans

తాజా మ్యాచ్‌లోనూ ధోనీని బిగ్ స్క్రీన్‌పై చూసిన ప్రేక్షకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 6 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగినప్పటికీ... గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.

మరోవైపు స్టీఫెన్ ఫ్లెమింగ్ సీఎస్‌కే హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ధోనీ అతని స్థానాన్ని భర్తీ చేస్తాడని ఆ జట్టు అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనను ధోనీ ఆస్వాదిస్తున్నాడు.

IND vs ENG: బూమ్ బూమ్ బుమ్రా.. 969 రోజుల తర్వాత రికార్డుల మోత!

IND vs ENG: బూమ్ బూమ్ బుమ్రా.. 969 రోజుల తర్వాత రికార్డుల మోత!

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌటైంది. జోరూట్(76 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 76 నాటౌట్), లియామ్ డాసన్(83 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 68) హాఫ్ సెంచరీలతో రాణించారు. బెన్ డకెట్(45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్‌ నాలుగు వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ రెండేసి వికెట్లు పడగొట్టారు. జస్‌ప్రీత్ బుమ్రా, శివమ్ దూబేకు చెరో వికెట్ దక్కింది.

Story first published: Tuesday, July 14, 2026, 20:35 [IST]
Other articles published on Jul 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+