Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: బూమ్ బూమ్ బుమ్రా.. 969 రోజుల తర్వాత రికార్డుల మోత!

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక వన్డే వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. 969 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేయడం ద్వారా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో 150 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. తద్వారా భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో 100+ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు.

IND vs ENG: ఆ గుండె కోత తర్వాత 969 రోజులకు..! (వీడియో)

IND vs ENG: ఆ గుండె కోత తర్వాత 969 రోజులకు..! (వీడియో)

టెస్ట్‌ల్లో 234 వికెట్లు తీసిన బుమ్రా.. టీ20ల్లో 121 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ గడ్డపై బుమ్రాకు ఇది 31వ వన్డే వికెట్‌. దాంతో ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక వన్డే వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా రికార్డ్ను బుమ్రా అధిగమించాడు.

ఇంగ్లండ్ గడ్డపై 17 వన్డే‌ల్లో బుమ్రా 31 వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా 22 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ (21 మ్యాచ్‌ల్లో 28), మదన్ లాల్(15 మ్యాచ్‌ల్లో 27), మహమ్మద్ షమీ(11 మ్యాచ్‌ల్లో 26) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Jasprit Bumrah Creates History Surpasses Ravindra Jadeja s Massive Record in IND vs ENG 1st ODI

బంతుల పరంగా అత్యంత వేగంగా 150 వన్డే వికెట్ల మైలురాయి అందుకున్న రెండో భారత పేసర్‌గా కూడా బుమ్రా రికార్డ్ సాధించాడు. ఈ 150 వికెట్లు తీయడానికి బుమ్రా 4605 బంతులు తీసుకున్నాడు.

IND vs ENG: గెలికి మరీ తన్నించుకోవడం అంటే ఇదే బ్రో! (వీడియో)

IND vs ENG: గెలికి మరీ తన్నించుకోవడం అంటే ఇదే బ్రో! (వీడియో)

4070 బంతులతో షమీ అగ్రస్థానంలో ఉండగా.. 4513 బంతులతో కుల్దీప్ యాదవ్.. బుమ్రా కంటే ముందున్నాడు. అజిత్ అగార్కర్ 5027 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో చివరి సారిగా ఆడిన బుమ్రా.. దాదాపు మూడేళ్ల తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌లో బరిలోకి దిగాడు.

Story first published: Tuesday, July 14, 2026, 18:58 [IST]
Other articles published on Jul 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+