చెన్నై సూపర్ కింగ్స్‌తో ధోనీకి విభేదాలు..?
చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)తో ఆ జట్టు మాజీ కెప్టెన్, భారత దిగ్గజ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీకి విభేదాలు తలెత్తాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సీఎస్‌కే సహయజమానిగా మారుతాననే ధోనీ అభ్యర్థనను ఆ జట్టు మేనేజ్‌మెంట్ తిరస్కరించడంతో ఇరు పక్షాల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.
IPL 2027: కోచ్‌గా యువరాజ్ సింగ్ అరంగేట్రం.. కళ్లుచెదిరే పారితోషకం!
ఐపీఎల్ ఆరంభం నుంచి సీఎస్‌కేకు ఆడుతున్న ధోనీ.. ఆ జట్టు ఎదుగుదలకు ఎంతో కృషి చేశాడు. ధోనీ కారణంగానే ఆ జట్టు పాపులర్ టీమ్‌గా ఎదిగింది. 6 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. సీఎస్‌కే కోసమే ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. ప్రస్తుతం 45 ఏళ్ల వయసులో ఉన్న ధోనీ.. ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సీఎస్‌కే షేర్లను కొనుగోలు చేసేందుకు ధోనీ ఆసక్తి చూపించినట్లు వార్తలు వస్తున్నాయి. తద్వారా ధోనీ సహయజమానిగా మారాలని భావించాడట.

షేర్ల విషయంలో విభేదాలు..
సీఎస్‌కే షేర్లను ఉచితంగా కాకుండా డబ్బులు చెల్లించేందుకు కూడా ధోనీ సిద్దమైనట్లు తెలుస్తోంది. కానీ ధోనీ మొత్తం 25 శాతం షేర్లను అడిగాడు. కానీ సీఎస్‌కే 3 శాతం మాత్రమే ఆఫర్ చేసిందని, దాంతో ధోనీ 20 శాతం షేర్లకు తగ్గాడని ఓ నివేదిక పేర్కొంది. చివరకు ధోనీ 18 శాతం షేర్లు అడగ్గా.. సీఎస్‌కే 5.5 శాతం కంటే ఎక్కువ ఇచ్చేది లేదని స్పష్టం చేసిందంట. అయితే మౌఖింగా జరిగిన ఈ చర్చలు విఫలమయ్యాయని, ధోనీకి, సీఎస్‌కే మేనేజ్‌మెంట్ మధ్య ఏళ్ల తరబడి ఉన్న సంబంధం తెగిపోవడానికి దారితీసిందని సదరు రిపోర్ట్ వెల్లడించింది.
గత కొన్నేళ్లుగా ధోనీని సంప్రదించకుండానే ఆటగాళ్ల ఎంపిక జరుగుతుందనే వాదన ఉంది. అంతేకాకుండా 18 ఏళ్ల పాటు జట్టుకు హెడ్ కోచ్‌గా సేవలందించిన స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఇటీవలే జట్టును వీడాడు.
ఐపీఎల్‌కు రిటైర్మెంట్..?
గాయం కారణంగా ధోనీ.. ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. గత 19 ఏళ్లలో అతను ఒక ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమవడం ఇదే తొలిసారి. 2008 నుంచి సీఎస్‌కే తరఫున ఆడుతున్న ధోనీ.. 278 మ్యాచ్‌లు ఆడి 38.30 సగటుతో 5439 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని సారథ్యంలో సీఎస్‌కే ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ఐపీఎల్ 2013 సీజన్‌లో 461 పరుగులు చేసిన ధోనీ.. ఆ సమయంలో తన అత్యధిక వ్యక్తిగత స్కోర్ 84. ఐపీఎల్ 2024 సీజన్‌లో 11 ఇన్నింగ్స్‌లు ఆడిన ధోనీ 220.54 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో ధోనీ 14 మ్యాచ్‌లు ఆడి 196 పరుగులు చేశాడు. అయితే సీఎస్‌కేతో ధోనీకి తలెత్తిన విభేదాల నేపథ్యంలో అతను ఐపీఎల్ 2027 సీజన్ ఆడుతాడా? లేక రిటైర్మెంట్ ప్రకటించి దూరంగా ఉంటాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సీఎస్‌కే మెంటార్‌గా ధోనీ బాధ్యతలు చేపడుతాడని ప్రచారం జరుగుతుండగా.. తాజా విభేదాల నేపథ్యం ఇది సాధ్యమవుతుందా? అనేది ప్రశ్నగా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
