Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: కోచ్‌గా యువరాజ్ సింగ్ అరంగేట్రం.. కళ్లుచెదిరే పారితోషకం!

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, ప్రపంచకప్ విజేత యువరాజ్ సింగ్ కోచ్‌గా తన రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించేందుకు సిద్దమయ్యాడు. ఇప్పటికే మెంటార్‌గా ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తున్న యువరాజ్ సింగ్.. ప్రొఫెషనల్ క్రికెట్‌లో అధికారికంగా ఇప్పటి వరకు కోచ్‌గా వ్యవహరించలేదు.

అప్‌కమింగ్ ఐపీఎల్ 2027 సీజన్‌లో యువరాజ్ సింగ్ కోచ్‌గా అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్‌గా యువరాజ్ సింగ్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే యువరాజ్ సింగ్ నియామక ప్రక్రియ పూర్తయిందని, ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే బాధ్యతలు స్వీకరిస్తాడని ప్రచారం జరుగుతోంది.

IND vs SL: కుల్దీప్‌‌పై వేటు.. అంకుల్‌కు చోటు! శ్రీలంకతో రెండో టెస్ట్ ఆడే భారత జట్టు ఇదే!

IND vs SL: కుల్దీప్‌‌పై వేటు.. అంకుల్‌కు చోటు! శ్రీలంకతో రెండో టెస్ట్ ఆడే భారత జట్టు ఇదే!

ఐపీఎల్ 2027 మినీ వేలంలో యువరాజ్ సింగ్ పాల్గొంటాడని తెలుస్తోంది. హెడ్ కోచ్‌గా యువరాజ్ సింగ్‌కు కళ్లు చెదిరే పారితోషకం ఇచ్చేందుకు ఢిల్లీ యాజమాన్యం సిద్దమైందని సమాచారం. రూ.9.5 కోట్ల భారీ వేతనంతో యువరాజ్ సింగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఓ కోచ్ అందుకున్న అత్యధిక పారితోషకం ఇదే కావడం విశేషం.

Yuvraj Singh Set to Become One of Highest-Paid Coaches in IPL 2027 gets Rs 9 5 crore per season Report

ఇప్పటి వరకు రికీ పాంటింగ్ పేరిట ఈ రికార్డ్ ఉంది. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా రికీ పాంటింగ్ రూ.9 కోట్ల వేతనం అందుకుంటున్నట్లు సమాచారం. అతని తర్వాత స్టీఫెన్ ఫ్లేమింగ్ రూ.7.5 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ డైరెక్టర్‌గా జహీర్ ఖాన్ రూ. 5 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రూ.4.5 కోట్లు, ఆండీ ఫ్లవర్, జస్టిన్ లాంగర్ రూ.4 కోట్ల చొప్పున వేతనం తీసుకున్నట్లు సమాచారం.

ఐపీఎల్ చరిత్రలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. యువరాజ్ సింగ్ పర్యవేక్షణలోనైనా ఆ ముచ్చట తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ జట్టు ఉంది. రిషభ్ పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరే అవకాశాలు ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న రిషభ్ పంత్.. తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు చేపడుతాడని ప్రచారం జరుగుతోంది.

IND vs SL: తొంటచెయి వాళ్లదే రాజ్యం.. టీమిండియాను గెలిపించిన లెఫ్టార్మ్ త్రయం!

Also Read

IND vs SL: తొంటచెయి వాళ్లదే రాజ్యం.. టీమిండియాను గెలిపించిన లెఫ్టార్మ్ త్రయం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలో మెరుగైన ప్రదర్శన చేసినా.. కీలక సమయంలో చేతులెత్తేసింది. 14 మ్యాచ్‌ల్లో 7 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో ఆరో స్థానంలో నిలిచింది.

Story first published: Thursday, August 20, 2026, 19:24 [IST]
Other articles published on Aug 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+