భువనేశ్వర్ కుమార్ కాస్త సమయం ఇవ్వండి: టీమిండియా బౌలింగ్ కోచ్
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అండగా నిలిచాడు. రెండు మ్యాచ్‌లతోనే అతనిపై ఓ అంచనాకు రావడం సరికాదని అభిప్రాయపడ్డాడు. అతనికి కాస్త సమయం ఇవ్వాలని సూచించాడు. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేసిన భువనేశ్వర్ కుమార్.. అంచనాలను అందుకోలేకపోయాడు.
న్యూజిలాండ్‌తో తొలి రెండు టీ20ల్లో ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. దాంతో భువనేశ్వర్ కుమార్‌పై విమర్శలు వచ్చాయి. వెల్లింగ్టన్ వేదికగా మంగళవారం మూడో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో సోమవారం మీడియాతో మాట్లాడిన మోర్నీ మోర్కెల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
గజ్జలో గాయంతో రెండో టీ20కి దూరమైన ఇషాన్ కిషన్.. మూడో టీ20కి కూడా అందుబాటులోకి రాలేదని మోర్కెల్ తెలిపాడు. గాయం నుంచి కోలుకున్నా మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేదన్నాడు. 'ఇషాన్ కిషన్ ఇంకా మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేదు. మూడో టీ20 కోసం బరిలోకి దిగడం లేదు.

బీసీసీఐ మెడికల్ టీమ్ నిరంతరం అతని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ తర్వాత అతని ప్రదర్శనపై బయట చర్చ జరుగుతోంది. అతనిపై భారీగా అంచనాలు ఉన్నాయి. నాలుగేళ్ల తర్వాత అతను పునరాగమనం చేశాడు.
గత రెండు ఐపీఎల్ సీజన్లలో అద్భతుమైన ప్రదర్శన చేశాడు. కానీ, అంతర్జాతీయంగా పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. కచ్చితంగా అతని నైపుణ్యం, అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. జట్టు సెట్ అవ్వడానికి అతనికి కాస్త సమయం ఇవ్వాలి. ప్రిన్స్ యాదవ్ యార్కర్లను వేయగలడనే రెండో టీ20 టీ20లో మయాంక్ యాదవ్‌ను పక్కనపెట్టాం. మయాంక్ యాదవ్ బాగానే బౌలింగ్ చేశాడు. కానీ డెత్ ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ చేస్తాడనే ప్రిన్స్ యాదవ్‌ను తీసుకున్నాం.
వెల్లింగ్టన్ వేదికగా జరిగే మూడో టీ20లో గాలి ప్రభావం ఎక్కువగా ఉండనుంది. అసలైన సవాల్ అదే. ఆ గాలి దాటికి మేమున్న హోటల్స్ కూడా షేక్ అవుతున్నాయి. మ్యాచ్ సమయంలోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు. అందుకు అనుగుణంగా మా ప్రణాళికలను సిద్దం చేసుకుంటాం. మా కుర్రాళ్లను కూడా అలాగే సన్నదం చేశాం. ఇక్కడే మేం ఓ టెస్ట్ మ్యాచ్‌ను కూడా ఆడాల్సి ఉంది.'అని మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


