మళ్లీ దుమ్మురేపిండు.. తెలుగోడి దెబ్బకు పాక్ స్టార్ క్రికెటర్ ఫిదా!
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు నమోదు చేసిన అద్భుత విజయంపై సరిహద్దు అవతల నుంచి ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఉత్కంఠ పోరులో అజేయంగా 51 పరుగులు సాధించి జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించిన తెలుగు యువ బ్యాటర్ తిలక్ వర్మపై పాకిస్తాన్ ప్రముఖ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ చేతిలో ఉన్న విజయాన్ని తిలక్ వర్మ ఒంటరి పోరాటంతో లాగేసుకున్నాడని కొనియాడారు.
ఆరంభంలో ఒత్తిడి.. చివర్లో ట్విస్ట్
ఈ మ్యాచ్‌ను విశ్లేషిస్తూ అహ్మద్ షెహజాద్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడారు. ఆరంభంలో వికెట్లు కోల్పోయిస అవసరమైన రన్ రేట్ బాగా పెరిగిపోవడంతో భారత జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడినట్లు కనిపించిందని వెల్లడించారు. అయితే అలాంటి క్లిష్ట పరిస్థితి నుంచి చివరి ఓవర్లలో తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డిల భాగస్వామ్యంతో టీమిండియా పుంజుకున్న తీరు నిజంగా అద్భుతమని ప్రశంసించారు.

తిలక్ వర్మ షాట్ల సెలెక్షన్ సూపర్
తిలక్ వర్మ బ్యాటింగ్ నైపుణ్యాలను అహ్మద్ షెహజాద్ ప్రత్యేకంగా ప్రశంసించారు. "తిలక్ కేవలం సిక్సర్ల కోసమే గుడ్డిగా శ్రమించలేదు. స్టేడియంలో గ్యాప్స్ వెతుక్కుంటూ, సరైన సమయంలో బౌండరీలు సాధిస్తూ క్రీజును ఎంతో సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాడు" అని తెలిపారుయ గతంలో పాకిస్తాన్ జట్టుతో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో కూడా తిలక్ ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడని గుర్తు చేశారు. ఆఫ్-స్టంప్ వైపు కదులుతూ షార్ట్-ఆర్మ్ జాబ్స్ ఆడటం, మోకాళ్లపై కూర్చుని ఎక్స్‌ట్రా కవర్, మిడ్-ఆఫ్ మీదుగా కొట్టిన షాట్లు తిలక్ అద్భుతమైన క్లాస్‌కు నిదర్శనమని చెప్పారు.
గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తిలక్ వర్మపై ఉంచిన నమ్మకాన్ని ఆ యువ ఆటగాడు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో నిలబెట్టుకున్నాడని అహ్మద్ షెహజాద్ పేర్కొన్నారు. ఈ అద్భుత విజయంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గంభీర్ ఎంతో సంతోషించి ఉంటారన్నారు. ఇదే సమయంలో భారత బౌలింగ్ విభాగంపై మాట్లాడుతూ.. స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెద్ద టోర్నమెంట్లలో నిజమైన మ్యాచ్ విన్నర్ కాబట్టి అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సూచించారు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌ను మెచ్చుకున్నప్పటికీ.. అంతిమంగా తిలక్ వర్మ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ అందరి దృష్టిని ఆకర్షించిందని అహ్మద్ షెహజాద్ కొనియాడారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


