Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. మూడో టీ20లో భారత తుది జట్టు ఇదే!

IND vs NZ 3rd T20: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌ను 3-0తో గెలుచుకోవడమే లక్ష్యంగా మంగళవారం(అక్టోబర్ 27) వెల్లింగ్టన్‌లోని హెన్రీ స్టేడియం వేదికగా జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును ఢీకొట్టేందుకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమవుతోంది. అయితే ఈ మూడో టీ20 మ్యాచ్ కోసం తుది జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

మళ్లీ దుమ్మురేపిండు.. తెలుగోడి దెబ్బకు పాక్ స్టార్ క్రికెటర్ ఫిదా!

మళ్లీ దుమ్మురేపిండు.. తెలుగోడి దెబ్బకు పాక్ స్టార్ క్రికెటర్ ఫిదా!

భువీ అవుట్.. మయాంక్ యాదవ్‌కు ఛాన్స్?
టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు ఈ సిరీస్ తీవ్ర నిరాశను మిగిల్చింది. అంతర్జాతీయ టీ20ల్లో 90 మ్యాచ్‌లు ఆడి 91 వికెట్లు తీసిన భువీ.. ఈ సిరీస్ లోని మొదటి రెండు మ్యాచ్‌ల్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. మొదటి మ్యాచ్‌లో 49 పరుగులు ఇవ్వగా.. రెండో టీ20లో 4 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. వరుసగా విఫలమవుతున్న భువనేశ్వర్ కుమార్‌కు జట్టు యాజమాన్యం విశ్రాంతి ఇవ్వాలని యోచిస్తోంది. భువీ స్థానంలో స్టార్ పేసర్ మయాంక్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. తొలి మ్యాచ్ మయాంక్ 40 పరుగులకు ఒక వికెట్ తీసినప్పటికీ.. రెండో మ్యాచ్‌లో ప్రిన్స్ యాదవ్ కోసం బెంచ్‌కే పరిమితమయ్యాడు.

IND vs NZ 3rd T20 Ishan Kishan Back Vaibhav Sooryavanshi Dropped Team India Likely Playing XI

ఇషాన్ కిషన్ రీ-ఎంట్రీ.. వైభవ్ ఔట్?
గాయం కారణంగా రెండో టీ20కి దూరమైన స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచిన ఇషాన్ కిషన్ రాకతో భారత బ్యాటింగ్ ఆర్డర్‌కు మరింత బలం చేకూరనుంది. కాగా రెండో టీ20లో ఇషాన్ కిషన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చి మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 8 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇప్పుడు ఇషాన్ కిషన్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో వైభవ్ తిరిగి బెంచ్‌కే పరిమితం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

నీళ్లలోంచి బయటపడ్డ చేపలా వైభవ్.. గంభీర్ నిర్ణయంపై మాజీలు ఫైర్!

Also Read

నీళ్లలోంచి బయటపడ్డ చేపలా వైభవ్.. గంభీర్ నిర్ణయంపై మాజీలు ఫైర్!

స్థిరంగా మిగతా బ్యాటింగ్ లైనప్
జట్టులోని మిగిలిన బ్యాటర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నమన్ ధీర్, ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిలు సిరీస్‌లో కనీసం ఒక్కసారైనా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు. దీంతో వీరంతా తుది జట్టులో తమ స్థానాలను నిలబెట్టుకోవడం దాదాపు ఖాయం. ఇక ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ లేదా వరుణ్ చక్రవర్తిని పరిశీలించే అవకాశం ఉన్నప్పటికీ.. వెల్లింగ్టన్ పిచ్ స్వభావాన్ని బట్టి మ్యాచ్ ప్రారంభానికి ముందు తుది నిర్ణయం తీసుకోనున్నారు.

మూడో టీ20 భారత తుది జట్టు(అంచనా):
అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.

Story first published: Sunday, October 25, 2026, 17:32 [IST]
Other articles published on Oct 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+