Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తుది జట్టులో చోటు లేకపోయినా.. వైభవ్‌ సూర్యవంశీకి పోయేది ఏం లేదు: మోర్నీ మోర్కెల్

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కకపోయినా జరిగే నష్టం ఏం లేదని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అన్నాడు. జట్టులో కొనసాగడం వల్ల సీనియర్ ఆటగాళ్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుందని చెప్పాడు. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా సన్నదమైంది. మంగళవారం జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

ఆసియా గేమ్స్‌లో ఓపెనర్‌గా ఆడిన వైభవ్ సూర్యవంశీకి ఈ సిరీస్‌లో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. వైభవ్ కోసం సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీయలేమని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. అతను ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందేనన్నాడు.

అతనికి అవకాశాలు ఇస్తే గొప్ప ఆల్‌రౌండర్‌ అవుతాడు: టీమిండియా బౌలింగ్ కోచ్

అతనికి అవకాశాలు ఇస్తే గొప్ప ఆల్‌రౌండర్‌ అవుతాడు: టీమిండియా బౌలింగ్ కోచ్

జట్టులో ఎంత ఉంటే అంత మంచిది..

తొలి టీ20కి ముందు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న మోర్నీ మోర్కెల్.. వైభవ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'వైభవ్ ప్రతిభ గురించి అందరికీ తెలిసిందే. అతను ఈ రకమైన వాతావరణంలో ఎంత ఎక్కువ సమయం గడిపితే.. అంత మంచిది. టాప్ క్లాస్ ప్లేయర్లతో కలిసి ఈ స్థాయి ప్రమాణాలతో ప్రాక్టీస్ చేయడం అతని క్రికెట్ భవిష్యత్తుకు మేలు చేస్తుంది.

Morne Morkel Says Limited Game Time Won t Slow Vaibhav Sooryavanshi s Development

ఒకవేళ అతనికి తుది జట్టులో ఆడే అవకాశం దక్కకపోయినా సరే... బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు, డగౌట్‌లో కూర్చున్నప్పుడు, హోటల్లో ఉన్నప్పుడు సీనియర్ ఆటగాళ్లతో కలిసి ఉండే అవకాశం లభిస్తోంది. సీనియర్ ప్లేయర్లు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు? మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్టు ఎలా ఆడుతున్నారు? అనే విషయాలను దగ్గరుండి చూడటమే అతని భవిష్యత్తుకు ఉపయోగపడనుంది.

IND vs WI: అతని కోసం వైభవ్ సూర్యవంశీపై వేటు! వెస్టిండీస్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

Also Read

IND vs WI: అతని కోసం వైభవ్ సూర్యవంశీపై వేటు! వెస్టిండీస్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

నేను రోజు ఒక టెస్ట్ పెడుతాను..

నేను బస్సులో అతన్ని ఎప్పుడూ ఒకటే అడుగుతుంటాను. 'ఈరోజు నువ్వు నేర్చుకున్న ఒక కొత్త విషయం ఏంటి? ఆ ఆటగాడి బ్యాటింగ్ గురించి నువ్వేమనుకుంటున్నావ్ చెప్పు?' అని ప్రశ్నిస్తుంటాను. ఇది అతన్ని మ్యాచ్‌ గురించి మరింత ఆలోచించేలా చేస్తుంది.

ఆసియా గేమ్స్ సమయంలో ఆ రకమైన జట్టు కాంబినేషన్ సరిపోతుందని వాళ్లు భావించి ఉంటారు. కానీ ఈ సిరీస్‌‌కు సంబంధించి మాకు ఎలాంటి కాంబినేషన్ ఉత్తమంగా ఉంటుందో ఈ రాత్రికి చర్చించి ఒక నిర్ణయానికి వస్తాం. సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆటగాళ్లు అంతా ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకొని ప్రణాళికలు రచిస్తాం'అని మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, October 5, 2026, 21:37 [IST]
Other articles published on Oct 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+