Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతనికి అవకాశాలు ఇస్తే గొప్ప ఆల్‌రౌండర్‌ అవుతాడు: టీమిండియా బౌలింగ్ కోచ్

టీమిండియా క్రికెటర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని గొప్ప ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతామని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అన్నాడు. అయితే అతనికి తగిన అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌‌ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన మోర్నీ మోర్కెల్.. నితీష్ రెడ్డి గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.

'నితీష్ రెడ్డి విషయానికి వస్తే.. టీ20ల్లో అతను వేర్వేరు పరిస్థితుల్లో అతను బౌలింగ్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. అతనితో మేం ఎప్పుడు చెప్పేది ఒకటే. వీలైనంత వరకు విషయాలను క్లిష్టంగా మార్చుకోకుండా బేసిక్స్‌‌కు కట్టుబడాలని. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్.. ఇలా అన్నింటిలోనూ అతను చాలా నైపుణ్యం కలిగిన ఆటగాడు.

అభిషేక్ శర్మ.. సంజూ శాంసన్‌‌ను చూసి నేర్చుకోవాలి: టీమిండియా కోచ్

అభిషేక్ శర్మ.. సంజూ శాంసన్‌‌ను చూసి నేర్చుకోవాలి: టీమిండియా కోచ్

అవకాశాలిస్తే గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు..

జట్టు విజయానికి కావాల్సిన అవకాశాలను సృష్టించేందుకు అతను ఎప్పుడూ తాపత్రయపడుతాడు. ఓ ఆటగాడికి అలాంటి మైండ్‌సెట్ ఉండటం చాలా మంచిది. నితీష్ ఒక గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదిగేందుకు అతనికి తగిన అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదృష్టవశాత్తూ ఇప్పుడు మాకు కొంత సమయం ఉంది. అతని నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచి గొప్ప ఆల్‌రౌండర్‌‌గా తయారు చేస్తే.. అది భారత క్రికెట్‌కు చాలా మంచిది.

Morne Morkel Backs Nitish Kumar Reddy to Develop Into Key All-Rounder for India Ahead of West Indies ODIs

ఈ స్థాయికి చేరుకోవడానికి కావాల్సిన నైపుణ్యం, సామర్థ్యం అతనిలో పుష్కలంగా ఉన్నాయి. కానీ మా వైపు నుంచి అతన్ని సరైన రీతిలో మేనేజ్ చేయడం, జట్టు కోసం తను వెళ్లి ఏం చేయాలో స్పష్టమైన, సులువైన రోల్ ఇవ్వడమే మిగిలి ఉంది' అని మోర్కెల్ చెప్పుకొచ్చాడు.

వర్క్‌లోడ్‌ను పర్యవేక్షిస్తున్నాం..

ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా వర్క్‌లోడ్‌ను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు. 'మేం ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాం. వాళ్లు ఫిట్‌గా ఉండి, జట్టుకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. హార్దిక్, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్లు గాయాలతో ఇంకా జట్టుకు అందుబాటులోకి రాలేదు. వాళ్లు మళ్లీ ఫిట్‌నెస్ సాధించి, మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.

బీసీసీఐ మెడికల్ టీమ్‌తో కలిసి దానికి తగ్గ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. ప్రతి ఒక్క ఆటగాడి కోసం ఖచ్చితమైన ప్రణాళిక ఉంది. సెలెక్టర్లకు, మేనేజ్‌మెంట్‌కు అత్యుత్తమ ఆటగాళ్ల గ్రూప్ అందుబాటులో ఉండేలా నిరంతరం పర్యవేక్షిస్తూ ముందుకు వెళ్తాం. ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లే ఆడాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ గాయాలవ్వడం సహజమే. అయితే భారత్‌కు బలమైన బెంచ్ బలం ఉంది. భారత్ తరఫున ఆడి సత్తా చాటేందుకు కుర్రాళ్లు సిద్దంగా ఉన్నారు. ఈ ఏడాది చివరికి గాయాల సమస్యలు తొలిగిపోతాయి. అక్కడి నుంచి అంతా బాగుంటుందని ఆశిస్తున్నా.

శుభ్‌మన్ గిల్ కాదు.. అతనే మా ఎక్స్-ఫ్యాక్టర్: టీమిండియా బౌలింగ్ కోచ్

Also Read

శుభ్‌మన్ గిల్ కాదు.. అతనే మా ఎక్స్-ఫ్యాక్టర్: టీమిండియా బౌలింగ్ కోచ్

బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్..

నేను బౌలింగ్ కోచ్‌గా ఉండగా తిరువనంతపురం వేదిక‌ను భారత్ ఆడటం ఇది రెండోసారి మాత్రమే. చివరిసారిగా న్యూజిలాండ్‌తో టీ20 మ్యాచ్‌ జరిగింది. అది చాలా హై-స్కోరింగ్ గేమ్. రాత్రి ట్రైనింగ్ సెషన్ చూశాక.. గత కొన్ని రోజులుగా పడ్డ వర్షాల వల్ల బంతి బాగా స్వింగ్ అవుతుందని అనుకున్నాను. కానీ బ్యాటింగ్‌కు పరిస్థితులు చాలా బాగున్నాయి. కొత్త బంతి కొద్దిగా ఇబ్బంది పెట్టినా, ఆ తర్వాత బ్యాటింగ్ చేయడానికి వికెట్ బాగుందని ప్లేయర్స్ చెప్పారు. కాబట్టి ఈ మ్యాచ్‌లో కూడా బ్యాట్‌కు, బాల్‌కు మధ్య మంచి పోటీ ఉంటుందని అనుకుంటున్నాను.

ఇది కూడా ఒక హై-స్కోరింగ్ మ్యాచ్ అవుతుందని భావిస్తున్నాను, ఇరు జట్లు కూడా చాలా దూకుడుగా ఆడే జట్లే. కాబట్టి కొత్త బంతి ఉన్నా లేకపోయినా.. మొదటి 15 నుంచి 20 ఓవర్లలో అక్కడ ఉన్న పిచ్ పరిస్థితులను ఎవరు బాగా అంచనా వేసి ఆడుతారో వాళ్లదే పైచేయి అవుతుంది.'అని మోర్కెల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, September 25, 2026, 20:49 [IST]
Other articles published on Sep 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+