IND vs WI: అతని కోసం వైభవ్ సూర్యవంశీపై వేటు! వెస్టిండీస్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. ఐదు టీ20ల సిరీస్ కోసం సన్నదమైంది. మంగళవారం లక్నో వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. జపాన్ వేదికగా ఆసియా గేమ్స్ 2026లో స్వర్ణ పతకం సాధించిన భారత్.. సోమవారం తెల్లవారుజామునే స్వదేశం చేరింది.
ఒక రోజు వ్యవధిలోనే వెస్టిండీస్‌తో తొలి టీ20లో తలపడనుంది. ఈ సిరీస్ నుంచి టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వగా.. టెస్ట్ ప్రిపరేషన్స్ కోసం చివరి నిమిషంలో వాషింగ్టన్ సుందర్‌ను జట్టు నుంచి తప్పించారు. సుందర్ స్థానంలో నమన్ ధీర్ బరిలోకి దిగాడు. ఈ క్రమంలోనే టీమ్ కాంబినేషన్‌లో మార్పులు జరగనున్నాయి.
వైభవ్ సూర్యవంశీపై వేటు..
జపాన్ కండిషన్స్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో భారత్ ఏకైక పేసర్(జస్‌ప్రీత్ బుమ్రా)ను ఆడించి.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. దాంతో వైభవ్ సూర్యవంశీని ఎక్స్‌ట్రా బ్యాటర్‌గా ఆడించింది. ఈ వ్యూహం భారత్‌కు బాగా కలిసొచ్చింది. కానీ భారత్‌లో ఏకైక పేసర్‌తో బరిలోకి దిగలేని పరిస్థితి. ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కు పరిమితం కానున్నాడు.

అతని స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి రానుండగా.. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా వైభవ్ అవకాశం కోసం కొన్నాళ్లు వేచి చూడాల్సిందేనని తెలిపాడు. వైభవ్ కోసం అభిషేక్- సంజూ కాంబినేషన్‌ను విడదీయలేమని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆరంభ మ్యాచ్‌ల్లో వైభవ్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
రవి బిష్ణోయ్‌పై వేటు..
జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో మయాంక్ యాదవ్ లేదా ప్రిన్స్ యాదవ్‌లో ఒకరికి చోటు దక్కనుంది. అర్ష్‌దీప్ సింగ్ పేస్ విభాగాన్ని నడిపించనుండగా.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, నమన్ ధీర్ స్పిన్ బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంది. పాకిస్థాన్‌తో ఫైనల్లో తేలిపోయిన రవి బిష్ణోయ్‌పై వేటు పడనుంది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్ మిడిలార్డర్ బాధ్యతలు పంచుకోనున్నారు.
వెస్టిండీస్‌తో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, నమన్ ధీర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్/మయాంక్ యాదవ్
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, నమన్ ధీర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


