Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శుభ్‌మన్ గిల్ కాదు.. అతనే మా ఎక్స్-ఫ్యాక్టర్: టీమిండియా బౌలింగ్ కోచ్

శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు టీమిండియా సన్నదమైంది. ఆగస్ట్ 15 నుంచి గాలే వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 ఫైనల్ బెర్త్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేయడం టీమిండియాకు కీలకం. ఈ క్రమంలో ఈ సిరీస్‌ను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. అయితే ఈ సిరీస్‌లో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తమ ఎక్స్‌ఫ్యాక్టర్ అని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అన్నాడు.

తొలి టెస్ట్ నేపథ్యంలో మోర్కెల్ గురువారం మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుత భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌లో కేఎల్ రాహుల్‌కు మాత్రమే శ్రీలంకలో ఆడిన అనుభవం ఉందని, అది జట్టుకు ఉపయోగపడుతుందని తెలిపాడు.

India Bowling Coach Morne Morkel Backs KL Rahul to Play Key Role for India Against Sri Lanka

రాహులే మా మ్యాచ్ విన్నర్..

'టెస్ట్‌ల్లో కేఎల్ రాహుల్ గత కొన్నేళ్లుగా భారత బ్యాటింగ్ విభాగాన్ని నడిపిస్తున్న తీరు అద్భుతం. శ్రీలంక కండీషన్స్, పిచ్‌లపై అతనికి అపారమైన అనుభవం ఉంది. అతనికి ఉన్న ఈ అనుభవం యువ ఆటగాళ్లకు ప్రాక్టీస్ సెషన్స్‌లో ఎంతగానో ఉపయోగపడింది. అదేవిధంగా గత కొన్ని నెలలుగా మా ప్లేయర్స్ వ్యక్తిగతంగా తమ ఆటను ఎంతో మెరుగుపరుచుకున్నారు.

ఈ సిరీస్‌ను గెలవడమే మా ముందున్న ప్రధాన లక్ష్యం. అందుకోసం ప్రత్యేక వ్యూహాలను సిద్దం చేశాం. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు 10 రోజుల ముందే ఇక్కడికి వచ్చాం.'అని మోర్నీ మోర్కెల్ చెప్పుకొచ్చాడు.

India vs Sri Lanka టెస్ట్ సిరీస్.. జియో హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

India vs Sri Lanka టెస్ట్ సిరీస్.. జియో హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే..?

ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా..

తొలి టెస్ట్‌లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందని మోర్నీ మోర్కెల్ తెలిపాడు. గాలె పిచ్ కండిషన్స్‌ పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. ఓవైపు నుంచి భారత స్పిన్ దళం అటాక్ చేస్తే.. మరో వైపు నుంచి పేసర్లు ఒత్తిడి తీసుకు రాగలరని తెలిపాడు.

'గాలే పిచ్ చూడటానికి మంచి వికెట్‌లా కనిపిస్తోంది. కానీ మ్యాచ్ సాగేకొద్దీ పిచ్‌లో మార్పు ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించే విధంగా మేం సిద్దమయ్యాం. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మాకు కావాల్సింది మానసిక బలం, బ్యాటింగ్‌లో సమయం, బౌలింగ్ స్పెల్స్ వేయడం, బంతిని సరైన ప్రదేశంలో వేయడం వంటివి.'అని ఇయాన్ మోర్గాన్ చెప్పుకొచ్చాడు.

గిల్ కాదు.. శ్రీలంక కండిషన్స్ అతనికి బాగా సూటవుతాయి: అజింక్యా రహానే

Also Read

గిల్ కాదు.. శ్రీలంక కండిషన్స్ అతనికి బాగా సూటవుతాయి: అజింక్యా రహానే

బ్యాటింగ్ పరంగా టీమిండియా బలంగానే ఉన్నా.. బౌలింగ్ బలహీనంగా కనిపిస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా దూరమవ్వడం పెద్ద లోటు కాగా.. జట్టులో ఉన్న ఆటగాళ్లంతా శ్రీలంక పర్యటనకు కొత్త కావడం మరో విశేషం. కేఎల్ రాహుల్‌, రవీంద్ర జడేజాకు మినహా శ్రీలంక పర్యటనలో టెస్ట్ సిరీస్ ఆడిన అనుభవం మరే ఆటగాడికి లేకపోవడం గమనార్హం.

Story first published: Thursday, August 13, 2026, 21:28 [IST]
Other articles published on Aug 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+