రాజకీయాల్లోకి మహమ్మద్ షమీ.. ఎమ్మెల్యేగా పోటీ!
భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇక చాలించుకున్నాడా? క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా అతను రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్‌ఎల్‌డీ) పార్టీ చీఫ్ జయంత్ చౌధరీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో షమీ ఆర్‌ఎల్‌డీ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అమ్రెహా అసెంబ్లీ స్థానం నుంచి షమీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. షమీ అమ్రెహా జిల్లాలోనే జన్మించాడు. యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలోని యూపీ ప్రభుత్వంలో ఆర్‌ఎల్‌డీ మిత్రపక్షంగా ఉంది. కానీ అమ్రెహా అసెంబ్లీకి ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ నేత మహబూబ్ అలీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అలీ.. తన సమీప బీజేపీ అభ్యర్థిపై 71 వేల ఓట్లతో విజయం సాధించి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు ఎన్‌డీఏ షమీని నిలబెట్టాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు ఇక్కడ షమీని నిలబెట్టి ఓటర్లను ఆకట్టుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజకీయ ప్రవేశంపై షమీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే షమీ రాజకీయాల్లోకి వస్తున్నాడని ప్రచారం జరగడం ఇదే తొలిసారి కాదు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఈ క్రికెటర్ బెంగాల్ నుంచి పోటీ చేస్తాడని ప్రచారం జరిగింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన షమీ.. పునరాగమనం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నా.. సెలెక్టర్లు అతన్ని పట్టించుకోవడం లేదు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలో కూడా షమీ మెరుగ్గా రాణించాడు. అతను ప్రాతినిథ్యం వహించిన ఈస్ట్ జోన్ టైటిల్ నెగ్గింది. రెస్టాఫ్ ఇండియా తరఫున షమీ.. ఇరానీ కప్ ఆడనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


