Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆట కాదు.. బలుపుతోనే రిజ్వాన్, ఇమామ్, అఘా చోటు కోల్పోయారు!

ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఏడుగురు ఆటగాళ్లు, ఇద్దరు కోచ్‌లపై వేటు వేస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సీనియర్ ప్లేయర్స్ మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘాల వేటు వెనుక వారి ప్రవర్తన కూడా ఓ కారణమని తెలుస్తోంది.

మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలను మూటగట్టుకొని మరో టెస్ట్ మిగిలి ఉండగానే 0-2తో సిరీస్ కోల్పోయింది. ఈ పరాజయాల నేపథ్యంలో పీసీబీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆఖరి మ్యాచ్‌కు ముందు టెస్ట్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌తో పాటు ఏడుగురి ఆటగాళ్లపై వేటు వేసింది. వైట్ బాల్ కోచ్ మైక్ హెస్సేన్‌ను తాత్కలిక కోచ్‌గా నియమించింది.

పాకిస్థాన్.. ప్యాంట్ మార్చినంత ఈజీగా ఆటగాళ్లను మారుస్తుంది: మాజీ కోచ్ గిలెస్పీ ఫైర్

పాకిస్థాన్.. ప్యాంట్ మార్చినంత ఈజీగా ఆటగాళ్లను మారుస్తుంది: మాజీ కోచ్ గిలెస్పీ ఫైర్

డ్రెస్సింగ్ రూమ్‌లో అనుచిత ప్రవర్తన..

ఈ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడిన మహమ్మద్ రిజ్వాన్ 61 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. ముఖ్యంగా అతని షాట్ సెలెక్షన్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇమామ్ ఉల్ హక్ పిక్క గాయంతో లార్డ్స్ టెస్ట్‌లో బ్యాటింగే చేయలేదు. అయితే అతని గాయంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. సల్మాన్ అఘా పరిస్థితి మాత్రం భిన్నం. తొలి టెస్ట్‌లో జట్టును నడిపించిన అతను రెండో టెస్ట్‌కు తుది జట్టులోనే చోటు కోల్పోయాడు. మూడో టెస్ట్‌కు జట్టులోనే లేకుండా పోయాడు.

Mohammed Rizwan Imam-ul-Haq Dropped Over Behavioural Issues Fresh details emerge from PCB shock move

పీటీఐ నివేదిక ప్రకారం.. రిజ్వాన్, ఇమామ్, సల్మాన్ అఘాల వేటుకు కేవలం వారి ప్రదర్శన కారణం కాదని, డ్రెస్సింగ్ రూమ్‌లో వారి ప్రవర్తనా సరిగ్గా లేకపోవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటనల్లోచోటు చేసుకున్న కొన్ని ఘటనలకు సంబంధించిన వార్తి ప్రవర్తనపై ఈ ముగ్గురు పీసీబీ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉందని సమాచారం.

నయా కోచ్ సూచనలతో..

మిగతా నలుగురు ప్లేయర్లను నయా కోచ్ మైక్ హెస్సెన్ సూచనల మేరకు తొలగించినట్లు తెలుస్తోంది. ఈ తాత్కలిక కోచ్ తన పర్యవేక్షణలో ఆడిన టెస్ట్ స్పెషలిస్ట్ ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు సమాచారం. 'వైట్-బాల్ క్యాంపులో తన పర్యవేక్షణలో ఆడిన ఆటగాళ్లను పరీక్షించాలనుకున్న తాత్కాలిక రెడ్-బాల్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ సూచనల మేరకే మిగిలిన ఆటగాళ్లను వెనక్కి పంపించారు.'అని ఓ పీసీబీ అధికారి తెలిపారు.

ఐర్లాండ్‌ చేతిలో భారత్ కూడా ఓడిపోయింది.. నా వల్లే పాక్ ఆట మెరుగైంది: పీసీబీ చీఫ్

Also Read

ఐర్లాండ్‌ చేతిలో భారత్ కూడా ఓడిపోయింది.. నా వల్లే పాక్ ఆట మెరుగైంది: పీసీబీ చీఫ్

తాజా పరిణామాలు పాకిస్థాన్ సెలక్షన్ కమిటీపై కూడా ప్రభావం చూపుతాయనే వాదన వినిపిస్తోంది. పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ ప్రణాళికలో భాగంగా సీనియర్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్‌ను కూడా తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారం ఆరంభంలో సెలెక్టర్ మిస్బా-ఉల్-హక్ తన రాజీనామాను సమర్పించడం కూడా కీలకంగా మారింది. అయితే ఆ రాజీనామాను పీసీబీ ఆమోదించిందా? లేదా? అనేది స్పష్టంగా తెలియదు. ఇంగ్లండ్ పర్యటన తర్వాత కొత్త సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసే అవకాశం ఉందని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి.

Story first published: Saturday, September 5, 2026, 12:12 [IST]
Other articles published on Sep 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+