Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్.. ప్యాంట్ మార్చినంత ఈజీగా ఆటగాళ్లను మారుస్తుంది: మాజీ కోచ్ గిలెస్పీ ఫైర్

పాకిస్థాన్ చీఫ్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్‌పై ఆ జట్టు మాజీ కోచ్, ఆస్ట్రేలియా దిగ్గజం జాసన్ గిలెస్పీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్యాంట్ మార్చినంత ఈజీగా జావేద్ ఆటగాళ్లను మార్చేస్తున్నాడని విమర్శించాడు. మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-2తో సిరీస్ కోల్పోయింది.

తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఓడిన పాకిస్థాన్.. రెండో టెస్ట్‌లో 194 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఈ పరాజయాలను సీరియస్‌గా తీసుకున్న పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఏకంగా ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేసింది. ఇందులో మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. అంతేకాకుండా హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌తో పాటు బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌‌ను తప్పించింది. మైక్‌హెస్సేన్‌ను టెస్ట్ కోచ్‌గా నియమించింది. ఐదుగురు అనమాక ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది.

ఈ పాపపు పాకిస్థాన్ జట్టు చేతిలో ఓడితే.. ఇంగ్లండ్‌కు అంతకన్నా సిగ్గు చేటు ఉండదు: స్టువర్ట్ బ్రాడ్

ఈ పాపపు పాకిస్థాన్ జట్టు చేతిలో ఓడితే.. ఇంగ్లండ్‌కు అంతకన్నా సిగ్గు చేటు ఉండదు: స్టువర్ట్ బ్రాడ్

అద్దంలో చూసుకో బ్రో...

సిరీస్ మధ్యలో పీసీబీ చేసిన మార్పులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై తాజాగా స్పందించిన గిలెస్పీ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టాడు. స్పష్టమైన ఎంపిక వ్యూహం లేదని, దాంతో ఆటగాళ్లు భయంతో ఆడుతున్నారని ఆరోపించాడు. 2024లో 8 నెలల పాటు పాకిస్థాన్‌కు కోచ్‌గా సేవలందించిన గిలెస్పీ.. మాజీ కోచ్‌లను నిందించే బదులు ఆకిబ్ జావేద్ తనను తాను అద్దంలో చూసుకోవాలని చురకలంటించాడు.

Jason Gillespie Questions Aaqib Javed s Selection Decisions After Pakistan Recall Seven Players

'పాకిస్థాన్ ఆటగాళ్ల పరిస్థితి చూస్తుంటే.. జాలేస్తుంది. ఇదే వాళ్ల జీవనాధారం. బయటి నుంచి చూస్తే.. పాక్ ఆటగాళ్లు భయంతో ఆడుతున్నట్లు అర్థమవుతోంది. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన సల్మాన్ అలీ అఘా.. రెండో టెస్ట్‌కు తుది జట్టులోనే లేడు. మూడో టెస్ట్‌కు జట్టులోనే లేకుండా పోయాడు. ఆటగాళ్ల సెలెక్షన్ తీరు ఇలా ఉంటే ఫలితాలు ఎలా వస్తాయి?

కనీస సమాచారం ఇవ్వలేదు..

ముఖ్యంగా ఆకిబ్ జావేద్ సారథ్యంలోని పాకిస్థాన్ సెలెక్షన్ కమిటీకి సరైన ఎంపిక వ్యూహం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. వారు రోజూ ప్యాంటు మార్చుకున్నట్లుగా తమ మనసు మార్చుకుంటారు. తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఆకిబ్ జావేద్.. నాతో పాటు గ్యారీ కిర్‌స్టన్‌ను నిందించారు.

పాకిస్థాన్‌ను చూసి ఈ ప్రపంచం నవ్వుతుంది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

Also Read

పాకిస్థాన్‌ను చూసి ఈ ప్రపంచం నవ్వుతుంది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

గత రెండేళ్లుగా చీఫ్ సెలెక్టర్‌గా ఉన్నది ఆకిబ్ జావేద్. పాకిస్థాన్ జట్టుకు ఈ పరిస్థితి రావడానికి మేమే కారణమని అతను చెబుతున్నాడు. కానీ ఈ మాటలు చెప్పేముందు జావేద్ అద్దంలో తనను తాను చూసుకోని ప్రశ్నించుకోవాలి. జట్టు నుంచి తొలిగించే విషయంపై ఆటగాళ్లకు చీఫ్ సెలెక్టర్ సరైన సమాచారం కూడా ఇవ్వలేదు. వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, మీడియా ద్వారానే వారు ఈ విషయాన్ని తెలుసుకున్నారు.'అని గిలెస్పీ చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ మాజీ మిక్కీ ఆర్థర్ కూడా ఇదో మూర్ఖపు చర్య అంటూ పీసీబీపై మండిపడ్డాడు.

Story first published: Friday, September 4, 2026, 16:53 [IST]
Other articles published on Sep 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+