ఐర్లాండ్ చేతిలో భారత్ కూడా ఓడిపోయింది.. నా వల్లే పాక్ ఆట మెరుగైంది: పీసీబీ చీఫ్
ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్థాన్ వరుస పరాజయాలపై వస్తున్న విమర్శలను ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ తిప్పికొట్టారు. పాకిస్థాన్ క్రికెట్ నాశనమైందని ఆ దేశ మాజీ క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలను మోహ్సిన్ నఖ్వీ తప్పుబట్టాడు. భారత్, సౌతాఫ్రికా వంటి జట్లు కూడా పసికూనలు చేతిలో ఓడిపోయాయని గుర్తు చేశాడు.
మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కోల్పోయింది. ఈ వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కఠిన చర్యలు తీసుకుంది. హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌తో పాటు ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేసింది.
భారత్ కూడా ఓడిపోయింది..
ఇలా ఒకేసారి ఏడుగురి ఆటగాళ్లతో పాటు కోచ్‌లను తప్పించడాన్ని ఆ దేశ మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. పీసీబీ చీఫ్‌గా మోహ్సిన్ నఖ్వీ జట్టును నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ విమర్శలపై స్పందించిన మోహ్సిన్ నఖ్వీ.. తమ నిర్ణయాలను సమర్థించుకున్నాడు. ఆధునిక క్రికెట్‌లో ఓటములు సహజమేనని పేర్కొన్నాడు.

'మమ్మల్ని విమర్శించేవారిని ఒక్కటి అడగాలనుకుంటున్నాను. సౌతాఫ్రికా నమీబియా చేతిలో.. భారత్, ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. అంతమాత్రాన అక్కడ క్రికెట్ ఏం ఆగిపోలేదు కాదా? క్రికెట్‌లో గెలుపు ఓటములు సహజం. మాకు అవసరమైన ఆటగాళ్లకు కచ్చితంగా అండగా ఉంటాము. కానీ అదే ఆటగాడు నిలకడగా రాణించకపోతే మేం ఏం చేయగలం? మాకు ప్రతి మ్యాచ్ ముఖ్యమైనదే.
నేనొచ్చాకే పాక్ ఆట మెరుగైంది..
ఈ రెండు పరాజయాల వెనుక చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఆ అల్లా దయ వల్ల వన్డేలు, టీ20ల్లో పుంజుకున్నట్లే టెస్ట్‌ల్లో కూడా మెరుగవుతాం. వాస్తవం ఏంటంటే.. కొందరు పనిగట్టుకొని నన్ను విమర్శిస్తున్నారు. నా వల్లే పాకిస్థాన్ జట్టు నాశనమైందని అంటున్నారు. కానీ నేను కొత్త కోచ్‌లను నియమించిన తర్వాతే పాకిస్థాన్ ప్రదర్శన మెరుగైంది.
వన్డే ర్యాకింగ్స్‌లో పాకిస్థాన్ 8 నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది. గత 6 వన్డే సిరీస్‌ల్లో 4 గెలిచింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 9 నుంచి 6వ స్థానానికి ఎగబాకింది. మా విజయాల శాతం కూడా 24 నుంచి 73 శాతానికి పెరిగింది.
ఓడినప్పుడు తిట్టండి..
నేను ఏ ఒక్క మ్యాచ్ గురించి మాట్లాడటం లేదు. కానీ పాకిస్థాన్ క్రికెట్ నాశనమైందని కొందరు అంటున్నారు. మేం ఓడిపోయినప్పుడు మమ్మల్ని విమర్శించే హక్కు వారికి ఉంటుంది. కానీ కొందరు మొత్తం వ్వవస్థనే విచ్చిన్నమైనట్లుగా చిత్రీకరిస్తున్నారు. క్రికెట్‌లో ఏం సాధించని వారు కూడా ఇలా మాట్లాడటం అన్యాయం. నేను ఎప్పుడూ మాజీ ఆటగాళ్లనే సలహాలు అడుగుతాను. ఇంగ్లండ్ పర్యటనలో మా ప్రదర్శన చాలా పేలవంగా ఉందని నేను అంగీకరిస్తున్నాను.
ఈ ఓటములకు గల కారణాల గురించి చర్చించుకున్నాం. ఈ వాస్తవాలను మీరు స్వయంగా పరిశీలించుకోండి. అవి తప్పు అయితే మమ్మల్ని ప్రశ్నించండి. కానీ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం మానుకోండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే.. వాస్తవాలతో విమర్శించండి. కానీ నిరాధారమైన ఆరోపణలు చేయవద్దు. వన్డేలు, టీ20ల్లో పాకిస్థాన్ సాధించిన పురోగతి అంతా ప్రస్తుతం జట్టుతోనే సాధ్యమైంది.
ఆటగాళ్ల ఎంపికలో తప్పులు జరుగుతున్నాయన్నది నిజమే. దానికి మేం కూడా బాధ్యత తీసుకుంటాం. కానీ విమర్శలు మాత్రం హద్దులు దాటుతున్నాయి. ఎవరికైనా నాతో సమస్య ఉంటే.. నన్ను వ్యక్తిగతంగా విమర్శించండి. కానీ నా ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకోకండి.'మోహ్సిన్ నఖ్వీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

