Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ బౌలింగ్‌తో ప్రపంచకప్ గెలవడం కష్టమే: భారత మాజీ క్రికెటర్

టీమిండియా బౌలర్లపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ విమర్శలు గుప్పించాడు. ఈ బౌలింగ్‌తో టీమిండియా ప్రపంచకప్ గెలవలేదని ఘాటుగా విమర్శించాడు. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 24 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి బౌలర్ల వైఫల్యమే ప్రధాన కారణమని మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.

'హైదరాబాద్ మ్యాచ్‌లో భారత్ ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ వైఫల్యమే. బౌలర్లే భారీగా పరుగులు సమర్పించారు. 247 పరుగులు ఇవ్వడమంటే మాములు విషయం కాదు. ఇదే తొలిసారి కాదు. అంతకుముందు 250+ టార్గెట్‌ను కాపాడుకోవడంలోనూ భారత బౌలర్లు విఫలమయ్యారు. ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిని బ్యాటర్లు గెలిపిస్తే.. మిగతా రెండింటిని బౌలర్లు ఓడించారు. ఇలాంటి కాంబినేషన్‌తో ప్రపంచకప్ నెగ్గడం అసాధ్యం.

Mohammed Kaif Slams Team India Bowlers After West Indies Defeat Says This Combination Won t Win World Cup

ఆ కాంబినేషన్‌ను గుర్తు చేసుకోండి..

ఒకసారి ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 కాంబినేషన్‌ను గుర్తు చేసుకోండి. ఆ విజయంలో జట్టులోని ప్రతీ ఒక్కరు భాగస్వామిగా నిలిచారు. జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్.. బౌలర్లతో పాటు బ్యాటర్లు సత్తా చాటారు. వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో అభిషేక్ శర్మ స్లోగా ఆడాడని అతన్ని విమర్శిస్తున్నారు.

IND vs WI: ఆ ఒక్క ఓవరే టీమిండియా కొంపముంచింది!

IND vs WI: ఆ ఒక్క ఓవరే టీమిండియా కొంపముంచింది!

ప్రతీ బ్యాటర్ అన్ని రోజులు అద్భుతంగా ఆడటం కష్టమని గ్రహించాలి. సంజూ శాంసన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.'అని మహమ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ మినహా మిగతా మూడింటిలో భారత బౌలర్లు 200+ రన్స్ సమర్పించుకున్నారు. పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు బౌలింగ్ చేయడంలో భారత బౌలర్లు విఫలమవుతున్నారు.

షైహోప్ విధ్వంసకర శతకం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. షై హోప్‌ (50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 102 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 నాటౌట్), షిమ్రాన్ హెట్‌మైర్(12 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు. విండీస్ బ్యాటర్ల ధాటికి భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

ఫుల్‌టాస్‌లు వేసి పిచ్‌ను అంటే ఎలా? భారత బౌలర్లపై గవాస్కర్ ఫైర్!

Also Read

ఫుల్‌టాస్‌లు వేసి పిచ్‌ను అంటే ఎలా? భారత బౌలర్లపై గవాస్కర్ ఫైర్!

అనంతరం భారత్ 19.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్(23 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించినా.. తిలక్ వర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(20 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 41) పోరాడినా ఫలితం లేకపోయింది. కీమో పాల్(5/41) ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. గుడకేష్ మోతీ(2/13) రెండు వికెట్లు పడగొట్టాడు. రొమారియో షెపెర్డ్, షమర్ స్ప్రింగర్ తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, October 15, 2026, 16:26 [IST]
Other articles published on Oct 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+