Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: ఆ ఒక్క ఓవరే టీమిండియా కొంపముంచింది!

పొట్టి ఫార్మాట్‌లో వెస్టిండీస్‌ను ఓడించడం అంత తేలిక కాదని మరోసారి రుజువైంది. భారత్‌తో వన్డే సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్.. ఐదు టీ20ల సిరీస్‌లో గట్టి పోటీ ఇస్తోంది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో 2-2తో సమంగా నిలిచింది.

షై హోప్‌ (50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 102 నాటౌట్) విధ్వంసకర శతకంతో భారత్ పతనాన్ని శాసించాడు. ఈ సిరీస్‌లో రెండో అజేయ శతకాన్ని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోర్ చేసింది.

IND vs WI: భారత్ ఓడినా.. అభిషేక్ శర్మ అదిరిపోయే రికార్డ్‌!

IND vs WI: భారత్ ఓడినా.. అభిషేక్ శర్మ అదిరిపోయే రికార్డ్‌!

బౌలర్లు కాదు..

అనంతరం భారత్ 19.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్(23 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీతో రాణించినా.. తిలక్ వర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(20 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 41) పోరాడినా ఫలితం లేకపోయింది. కీమో పాల్(5/41) ఐదు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. గుడకేష్ మోతీ(2/13) రెండు వికెట్లు పడగొట్టాడు. రొమారియో షెపెర్డ్, షమర్ స్ప్రింగర్ తలో వికెట్ తీసారు.

IND vs WI 4th T20I Turning Point Gudakesh Motie 12th Over Proves Costly for India in Hyderabad T20I

బౌలింగ్ వైఫల్యం టీమిండియా ఓటమికి ప్రధాన కారణమైనా? వారిని నిందించలేం. ఎందుకంటే ఉప్పల్ స్టేడియంలో బౌండరీలు చాలా చిన్నవిగా ఉంటాయి. అంతేకాకుండా పిచ్ కండిషన్స్‌ కొంచెం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. పిచ్‌పై బంతి ఆగి వచ్చినా.. ఆ విషయాన్ని భారత బౌలర్లు పసిగట్టలేక మూల్యం చెల్లించుకున్నారు. బౌలర్లు విఫలమైనా.. బ్యాటర్లు సరిగ్గా ఆడి ఉంటే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచేదని విశ్లేషకులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ములపు తిప్పిన గుడకేష్ ఓవర్..

248 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సంజూ శాంసన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. 3 ఓవర్లలోనే భారత్ 50 పరుగులు చేసింది. కానీ సంజూ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వెనుదిరిగినా.. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ జట్టును ముందుకు నడిపించారు. దాంతో భారత్ గెలుస్తుందనే అంతా అనుకున్నారు. కానీ గుడకేష్ మోటీ వేసిన 12వ ఓవర్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఈ ఓవర్‌లో వరుస బంతుల్లో అభిషేక్ శర్మ, నమన్ ధీర్(0) ఔటవ్వడం భారత్ పతనాన్ని శాసించింది.

IND vs WI: రఫ్ఫాడించిన కీమో పాల్.. ఉప్పల్‌ మ్యాచ్‌లో భారత్‌‌ ఓటమి!

Also Read

IND vs WI: రఫ్ఫాడించిన కీమో పాల్.. ఉప్పల్‌ మ్యాచ్‌లో భారత్‌‌ ఓటమి!

ఆ తర్వాత తిలక్, నితీష్ రెడ్డి రాణించినా.. లక్ష్యం పెద్దది కావడంతో దూకుడుగా ఆడాలనే ఒత్తిడి వారిని ఔటయ్యేలా చేసింది. నమన్ ధీర్ కాసేపు క్రీజులో ఉండి భారీ షాట్స్ ఆడి ఉంటే.. ఇతర బ్యాటర్లపై ఒత్తిడి తగ్గేది. అప్పుడు భారత్‌కు గెలిచే అవకాశం ఉండేది. బ్యాటర్ వైఫల్యాన్ని అంగీకరించని శ్రేయస్ అయ్యర్ బౌలర్లను నిందించాడు. ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయకపోవడంతోనే ఓటమిపాలయ్యామని చెప్పాడు.

Story first published: Thursday, October 15, 2026, 9:09 [IST]
Other articles published on Oct 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+