Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌పై సాధించిన ఆ విజయంతోనే మా పతనం మొదలైంది: పాక్ మాజీ క్రికెటర్

ఐదేళ్ల క్రితం భారత్‌పై సాధించిన విజయంతోనే తమ జట్టు పతనం మొదలైందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసుఫ్ అన్నాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021లో భారత్‌పై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో గెలిచిన తర్వాత తమ ఆటగాళ్లకు గర్వం తలకెక్కిందని విమర్శించాడు. తాము ఏదో గొప్ప విజయం సాధించామని విర్రవీగారని, కెప్టెన్సీ కోసం నెలకొన్న పోటీ డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలను సృష్టించిందని ఆరోపించాడు.

ప్రస్తుతం పాకిస్థాన్ దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా రెండు టెస్ట్‌ల్లో ఘోర పరాజయాలను మూటగట్టుకున్న పాకిస్థాన్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయింది. రెండు టెస్ట్‌ల్లో కనీసం 200 పరుగులు చేయలేకపోయింది. దాంతో పీసీబీ కఠిన చర్యలు తీసుకుంది. హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌తో పాటు ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేసింది. ఈ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఆస్కార్ లెవెల్ యాక్టింగ్: పాక్ క్రికెటర్ కుంటి నడక డ్రామా బట్టబయలు! (వీడియో)

ఆస్కార్ లెవెల్ యాక్టింగ్: పాక్ క్రికెటర్ కుంటి నడక డ్రామా బట్టబయలు! (వీడియో)

ఆ విజయమే మా కొంపముంచింది..

తాజాగా తమ జట్టు పతనం గురించి మాట్లాడిన మహ్మద్ యూసుఫ్ విచిత్రకర కారణాన్ని వెల్లడించాడు. 'ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021లో భారత్‌పై పాకిస్థాన్ గెలిచింది. ఆ విజయం పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం చేసింది. ఎందుకుంటే ఆ విజయం తర్వాత మా ఆటగాళ్లకు గర్వం తలకెక్కింది. ఏదో గొప్ప విజయాన్ని సాధించామని కొందరు ఆటగాళ్లు భావించడం ప్రారంభించారు. దాంతో ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. విజయాలు సాధించినప్పుడు వినయంగా ఉండాలి. అహంకారంతో విర్రవీగితే సమస్యలు వస్తాయి. పాకిస్థాన్ క్రికెట్‌లో ఇలాంటి సమస్యలే తలెత్తాయి.

Mohammad Yousuf Blames 2021 India Victory for Pakistan s Downfall Says That Win Damaged Us

జట్టులో ప్రతీ ఒక్కరూ కెప్టెన్..

జట్టులోని ప్రతీ ఒక్కరూ కెప్టెన్ కావాలని ప్రయత్నించారు. దాని పర్యవసానాలు జట్టుకు తీవ్ర నష్టం కలిగించాయి. భారత్‌పై విజయం తర్వాత వన్డే, టీ20 ప్రపంచకప్‌లు, ఆసియా కప్‌లు, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ చెత్త ప్రదర్శన కనబర్చింది. జట్టును గాడిన పెట్టేందుకు పీసీబీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. కెప్టెన్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందిని మార్చింది. కానీ ఏ ఆటగాడు ముందుకు వచ్చి బాధ్యత తీసుకోలేదు.'అని మహ్మద్ యూసుఫ్ చెప్పుకొచ్చాడు.

తిలక్ వర్మ X వైభవ్ సూర్యవంశీ.. 54 ఏళ్ల‌లో ఇదే తొలిసారి.!

Also Read

తిలక్ వర్మ X వైభవ్ సూర్యవంశీ.. 54 ఏళ్ల‌లో ఇదే తొలిసారి.!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021లో జరిగిన నాటి మ్యాచ్‌లో 152 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ ఒక్క వికెట్ కోల్పోకుండా ఛేదించింది. ఓపెనర్లు బాబర్ ఆజామ్(68నాటౌట్), మహ్మద్ రిజ్వాన్(79 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో జట్టుకు ఘన విజయాన్ని అందించారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే భారత్‌పై పాకిస్థాన్ గెలవడం అదే తొలిసారి.

ఆ మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఆ తర్వాత పాకిస్థాన్ చేతిలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మహిళల క్రికెట్‌లోనూ భారత్‌దే ఆధిపత్యం కొనసాగుతోంది. శనివారం జరిగిన మహిళల ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్లతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.

Story first published: Monday, September 7, 2026, 11:37 [IST]
Other articles published on Sep 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+