Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ పద్దతి మార్చుకో.. అతనేం వాటర్ బాయ్ కాదు: కైఫ్

Mohammad Kaif slams Virat Kohli for not backing players
Mohammad Kaif Slams Virat Kohli For Not Backing Players

హైదరాబాద్: యువ ఆటగాళ్ల పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుసరిస్తున్న తీరును మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తప్పుబట్టాడు. ముఖ్యంగా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ విషయాన్ని ప్రస్తావిస్తూ విరాట్‌పై ఈ మాజీ క్రికెటర్ విమర్శలు గుప్పించాడు. జట్టు ఎంపిక విషయంలో కోహ్లీ చాలా ప్రయోగాలు చేస్తున్నాడని, గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో జట్టు సమతూకం కోసం చాలా కాంబినేషన్స్ ప్రయోగించాడన్నాడు.

ఇదే మెగాటోర్నీలో భారత ఓటమికి కారణమైందని అభిప్రాయపడ్డాడు. అనవసర ప్రయోగాలకు బదులు కోహ్లీ యువ ఆటగాళ్లకు మద్దతుగా నిలవాలని సూచించాడు. హలో మొబైల్ యాప్‌ వేదికగా శనివారం ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసిన కైఫ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

అప్పుడే సక్సెస్ వస్తుంది..

అప్పుడే సక్సెస్ వస్తుంది..

‘జట్టు ఎంపికలో చాలా ప్రయోగాలు చేస్తున్నాడు. అతను అలా చేయాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో చాలా కాంబినేషన్స్‌ను ప్రయోగించాడు. అది జట్టు ఓటమికి కారణమైంది. టీమ్ సెలెక్షన్‌పై కోహ్లీ దృష్టి సారించాలి. కొన్ని మ్యాచ్‌ల్లో ఫామ్ కోల్పోతే, ఆ ఆటగాళ్లకు మద్దుతు ఇవ్వాలి. అలా జట్టు అవసరాలకు కావాల్సి ఆటగాళ్లను సిద్దం చేసుకోవాలి. అప్పుడే అతను మంచి జట్టును తయారు చేసుకోగలడు.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.

రాహుల్ బ్యాకప్ కీపరే..

రాహుల్ బ్యాకప్ కీపరే..

భారత జట్టులో వికెట్ కీపర్ స్థానం గురించి కైఫ్ మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్ బ్యాకప్ కీపర్‌గా ఉండటం జట్టుకు మంచిదని, కానీ ప్రధాన కీపర్‌గా మాత్రం అతను ఉండలేడన్నాడు. ఇక గత కొన్ని సిరీస్‌ల్లో రిషభ్ పంత్‌ను పక్కన పెట్టడంపై ఈ మాజీ క్రికెటర్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

‘చివరకు వికెట్ కీపర్ స్థానంలో కూడా చాలా మంది ఆటగాళ్లను ప్రయోగించారు. భారత్‌కు పర్మినెంట్ కీపర్ కావాలి. కేఎల్ రాహుల్ బ్యాకప్ కీపర్ మాత్రమే. కానీ అతను ప్రధాన కీపర్‌గా ఉంటాడని మాత్రం నేను అనుకోవడం లేదు. ధోనీని పక్కనపెట్టి పంత్‌కు మద్దతు ఇవ్వాలనుకుంటే మాత్రం అతనికి కోహ్లీ అండగా ఉండాలి. వాటర్ బాయ్‌గా ఉండేందుకు పంత్ జట్టులోకి రాలేదు' అని కైఫ్ చురకలంటించాడు.

రోహిత్ భాయ్.. తిట్టని తిట్టూ తిట్టారు: బంగ్లాదేశ్ క్రికెటర్

అలా చేస్తే విజయవంతమైన కెప్టెన్ కోహ్లీనే

అలా చేస్తే విజయవంతమైన కెప్టెన్ కోహ్లీనే

కోహ్లీ రిటైర్మెంట్ నాటికి ధోనీ కన్నా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అవుతాడని కైఫ్ జోస్యం చెప్పాడు. కాకపోతే దీనికి కోహ్లీ ఆటగాళ్లకు మద్దతుగా నిలవడంతో పాటు మరిన్ని విజయాలు సాధించాలన్నాడు. జట్టుగా అనే భావనను కొనసాగించడం కూడా చాలా ముఖ్యమని చెప్పుకొచ్చాడు.

‘కోహ్లీసేన ఈ అడ్డంకులన్నిటినీ అధిగమిస్తే.. రిటైర్ అయ్యే సమయానికి విరాట్ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలుస్తాడు.

కోహ్లీ తన జట్టులో మ్యాచ్ విన్నర్‌లు, బాగే ఆడే ఆటగాళ్లు కలిగి ఉన్నాడు. వారికి అండగా నిలుస్తూ జట్టును బిల్డప్ చేసుకుంటే సరిపోతుంది. ఇలానే జట్టుగా ఉంటే అద్భుతమే జరుగుతుంది. ప్రస్తుతం అవలంభిస్తున్న తన పద్దతిని మార్చుకుంటేనే కోహ్లీ సక్సెస్ అవుతాడు.'అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.

సెలెక్టర్ల తీరును కూడా..

సెలెక్టర్ల తీరును కూడా..

ఇక సెలెక్టర్ల తీరుపై కూడా కైఫ్ విరుచుకుపడ్డాడు. జట్టు నుంచి తొలగించిన ఆటగాళ్లతో సెలక్షన్ కమిటీ, టీమ్ కోచ్ లేదా కెప్టెన్ మాట్లాడాలని అన్నారు. ప్రతీ క్రీడాకారుడు దేశం కోసమే ఆడుతున్నాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు. ‘ప్రతీ క్రీడాకారుడికి బ్యాడ్ టైమ్ ఉంటుంది. మేనేజ్‌మెంట్ జట్టు నుంచి తొలగించిన ఆటగాళ్లను ఎందుకు పక్కన పెట్టారనేదానిపై కనీసం సమాచారం ఇవ్వాలి. తద్వారా వాళ్లు దేశీయ మ్యాచ్‌ల్లో తమను మెరుగుపరుచుకొని భారత జట్టులోకి పునరాగమనం చేస్తారు. ఒకప్పుడు మీడియా నివేదికల ద్వారా జట్టులో ఉన్నామా లేదా అనే విషయం తెలిసేది. ప్రస్తుతానికైతే పరిస్థితి అంత అధ్వాన్నంగా లేదు. అయితే ఇప్పటికీ సెలక్షన్ కమిటీ, కెప్టెన్, కోచ్ కలిసి కూర్చుని జట్టు నుంచి మినహాయించిన ఆటగాళ్లతో మాట్లాడాలి.' అని కైఫ్ సూచించాడు.

ప్రేక్షకులకు భయపడి అంపైర్ ఔటివ్వలేదు.. లేకుంటే సచిన్ డబుల్ సెంచరీ చేసేవాడు కాదు: స్టెయిన్

Story first published: Sunday, May 17, 2020, 14:35 [IST]
Other articles published on May 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+