పరుగులు తర్వాత.. ముందు 50 ఓవర్లు ఆడండి సామీ: మహమ్మద్ కైఫ్
ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో ఓటమిపాలైన టీమిండియాపై మాజీ కెప్టెన్ మహమ్మద్ కైఫ్ విమర్శలు గుప్పించాడు. 8వ స్థానం వరకు బ్యాటింగ్ డెప్త్ ఉన్నా.. 50 ఓవర్ల పాటు ఆడకపోవడం ఏంటని ప్రశ్నించాడు. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 233 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
రోహిత్ శర్మ (26), శుభ్‌మన్ గిల్(31), విరాట్ కోహ్లీ(65), శ్రేయస్ అయ్యర్(66), జస్‌ప్రీత్ బుమ్రా(20 నాటౌట్) మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే ఆల్‌రౌండర్లతో 8వ స్థానం వరకు టీమిండియాకు బ్యాటింగ్ డెప్త్ ఉంది.

కానీ ఈ ముగ్గురు ఆల్‌రౌండర్లు 3 పరుగులే చేసి వెనుదిరగడంతో టీమిండియా 50 ఓవర్లు పూర్తిగా ఆడకపోయింది. శివమ్ దూబే డకౌట్ కాగా.. ఇషాన్ కిషన్ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. దాంతో 6 ఓవర్లు మిగిలి ఉండగానే టీమిండియా ఆలౌటైంది. అనంతరం ఇంగ్లండ్.. 44.1 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసి గెలుపొందింది. జోరూట్(99 నాటౌట్) అజేయంగా నిలిచి భారత్‌కు విజయాన్ని అందించాడు. భారత బౌలర్లు బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ రాణించినా ఫలితం లేకపోయింది.
ఈ మ్యాచ్ గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన మహమ్మద్ కైఫ్.. బ్యాటింగ్ డెప్త్ కలిగిన టీమిండియా 50 ఓవర్ల పాటు ఆడకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. టీమిండియా 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి ఉంటే టీమిండియా విజయం సాధించేదని అభిప్రాయపడ్డాడు. 'వన్డేలు ఆడేటప్పుడు మనం ఎన్ని పరుగులు చేశామన్నది వేరే విషయం. కానీ అన్నింటికన్నా ముందు మన సీనియర్ ఆటగాళ్లు మనకు నేర్పిన మొదటి పాఠం ఏంటంటే.. 50 ఓవర్లు పూర్తిగా ఆడాలి.
ఈ రోజుల్లో బ్యాటింగ్ డెప్త్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. కానీ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు 8వ స్థానం వరకు బ్యాటింగ్ లైనప్ ఉన్నా 50 ఓవర్ల పాటు ఆడకుండానే ఆలౌట్ కావడం నిరాశ కలిగించింది. టీమిండియా పూర్తిగా బ్యాటింగ్ చేసి ఉంటే అదనంగా 30-50 పరుగులు చేసేది. అప్పుడు భారత్ విజయవకాశాలు మెరుగ్గా ఉండేవి'అని మహమ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

