కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌కు కారణం అదే: మహమ్మద్ కైఫ్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టులోని వాతావరణం నచ్చకనే రిటైర్మెంట్ ప్రకటించాడని అభిప్రాయపడ్డాడు. గతేడాది తనకు ఎంతో ఇష్టమైన టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ ఆకస్మికంగా తప్పుకున్నాడు. అతని నిర్ణయం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అనేక సందేహాలకు తావిచ్చింది.
తన నిర్ణయానికి ముందే విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడాడు. టెస్ట్ క్రికెట్‌లో కొనసాగేందుకు ఆసక్తి చూపించాడు. కానీ అంతలోనే ఏమైందో ఏమో తెలియదు కానీ.. సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. మానసిక ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో కోహ్లీ చెప్పాడు.

తాజాగా కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన కైఫ్.. పరోక్షంగా గంభీర్‌పై ఆరోపణలు గుప్పించాడు.' టెస్ట్ రిటైర్మెంట్ గురించి విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూలు చూసినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. అతని ముఖంలో కొంత నిరాశ కనిపించింది. ఫామ్ బాగాలేకపోయినా.. అతను విరాట్ కోహ్లీ. వన్డేల్లో కూడా అతను ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. అతని ఇంటర్వ్యూలను బట్టి చూస్తే.. జట్టు వాతావరణం నచ్చకనే రిటైర్మెంట్ ప్రకటించినట్లు అనిపిస్తోంది.
జట్టులో విరాట్ కోహ్లీకి తగిన ప్రాధాన్యత, మద్దతు లభించడం లేదని అతను భావించినట్లు అనిపించింది. అతను గనుక కొనసాగించి ఉంటే.. కచ్చితంగా పూర్వ వైభవం అందుకునేవాడని నా అభిప్రాయం. రీఎంట్రీకి అతను పెట్టింది పేరు.'అని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
టెస్ట్ క్రికెట్‌లో 10 వేల పరుగుల మైలురాయి అందుకోకూండానే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. మరో 770 పరుగులు చేస్తే ఈ ఫీట్ సాధించేవాడు. తన కెరీర్‌లో 123 టెస్ట్‌లు ఆడిన కోహ్లీ 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలతో పాటు 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2011లో వెస్టిండీస్‌తో టెస్ట్ క్రికెట్ ప్రారంభించిన కోహ్లీ.. కెరీర్ ఆరంభంలో తడబడ్డాడు.
జట్టులో కూడా చోటు కోల్పోయాడు. 2011-12 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటాడు. 2014లో ధోనీ వారుసుడిగా టెస్ట్ బాధ్యతలు అందుకున్నాడు. కోహ్లీ సారథ్యంలో భారత్ 68 మ్యాచ్‌లు ఆడి 40 విజయాలు సాధించింది. భారత మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ కన్నా ముందు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


