Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: జైస్వాల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలి.. ఆసియా గేమ్స్‌కు బుమ్రా అవసరమా?

సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా బ్యాకప్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ఆడించాలని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సూచించాడు. శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసినా.. జైస్వాల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సలహా ఇచ్చాడు.

ఇక ఆసియా గేమ్స్ 2026‌‌కు భారత అత్యుత్తమ జట్టును పంపించడంపై కైఫ్ విస్మయం వ్యక్తం చేశాడు. ఆసియా గేమ్స్‌కు బుమ్రా, అయ్యర్ వంటి ఆటగాళ్లు అవసరమా? అని ప్రశ్నించాడు. ఆదివారం తిరువనంతపురం వేదికగా జరిగే తొలి వన్డేతో వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఆసియా గేమ్స్ 2026 నేపథ్యంలో జస్‌ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ ఈ వన్డే సిరీస్‌కు దూరమయ్యారు.

IND vs NZ: హార్దిక్ పాండ్యాకు మరో గాయం.. న్యూజిలాండ్ పర్యటనకు దూరం!

IND vs NZ: హార్దిక్ పాండ్యాకు మరో గాయం.. న్యూజిలాండ్ పర్యటనకు దూరం!

జైస్వాల్‌‌ను నాలుగో స్థానంలో ఆడించాలి..

తొలి వన్డే నేపథ్యంలో యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన కైఫ్.. భారత తుది జట్టు కాంబినేషన్‌పై మాట్లాడాడు. బుమ్రా, అయ్యర్‌ను వన్డేలకు దూరంగా ఉంచడాన్ని కూడా ప్రశ్నించాడు. 'ఈ సిరీస్‌లో యశస్వి జైస్వాల్‌ను నాలుగో నంబర్‌లో ఆడించొచ్చు. రోహిత్ శర్మ రిటైర్ అనంతరం ఎలాగూ తనే ఓపెనింగ్ చేస్తాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌ను కాస్త మార్చుకోవచ్చు.

Mohammad Kaif Picks India s Playing XI for 1st ODI vs West Indies Says Play Jaiswal at No 4

రోహిత్, గిల్ ఓపెనర్లుగా.. విరాట్ కోహ్లీ మూడో నంబర్‌లో, శ్రేయస్ అయ్యర్ లేడు కాబట్టి జైస్వాల్ నాలుగో స్థానంలో ఆడించవచ్చు. ఐదో స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, ఆరో ప్లేస్‌లో కేఎల్ రాహుల్, ఏడో స్థానంలో జడేజా, ఆ తర్వాత నితీష్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, తర్వాత పేసర్లు బరిలోకి దిగవచ్చు. ఈ సిరీస్‌లోనే జైస్వాల్, గైక్వాడ్ ఇద్దర్నీ ఆడించవచ్చు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకోవచ్చు. జైస్వాల్‌ను నాలుగో స్థానంలో ఆడించడంలో ఎలాంటి సమస్య ఉండదు.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.

IND vs WI: 27 ఏళ్ల రికార్డ్‌పై కన్నేసిన రవీంద్ర జడేజా.. మరో వికెట్ తీస్తే..!

Also Read

IND vs WI: 27 ఏళ్ల రికార్డ్‌పై కన్నేసిన రవీంద్ర జడేజా.. మరో వికెట్ తీస్తే..!

అత్యుత్తమ జట్టు ఎందుకు..?

ఆసియా గేమ్స్‌కు భారత అత్యుత్తమ జట్టును పంపించడంపై కైఫ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'నేను ఆసియా గేమ్స్ జట్లను పరిశీలించాను. చాలా దేశాలు కొత్త ఆటగాళ్లను పంపాయి. భారత్ మాత్రం వన్డేలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆసియా గేమ్స్‌పై దృష్టి పెట్టింది. భారత ప్రధాన ఆటగాళ్లంతా అక్కడే ఉన్నారు. మిగతా దేశాలు యంగ్ టీమ్స్‌ను పంపాయి. అంటే వాళ్లకు గోల్డ్ మెడల్ గెలవడం ముఖ్యం కాదా? మనం ఎలాగైనా గోల్డ్ గెలవాలని చూస్తుంటే.. మిగతా జట్లు మాత్రం ఆటగాళ్లను తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాయా? లేదా ఈ టోర్నీకి అంతగా ప్రాధాన్యత ఇవ్వడంలేదా?

గెలవాలనే పట్టుదల ఉండటం మంచిదే. కానీ ఇప్పుడు వెస్టిండీస్ సిరీస్ జరుగుతోంది. వరల్డ్ కప్‌కు ముందు మనకు ఉన్నది కొన్ని వన్డేలు మాత్రమే. అలాంటప్పుడు వన్డేల కంటే ఆసియా గేమ్స్‌కే అత్యుత్తమ జట్టు ఎందుకు పంపించామో నాకు అస్సలు అర్థం కావడం లేదు.'అని మహమ్మద్ కైఫ్ పేర్కొన్నాడు.

Story first published: Saturday, September 26, 2026, 18:07 [IST]
Other articles published on Sep 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+