For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో రాణించినప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ఆడలేనా?.. సెలెక్టర్ల తీరుపై హర్భజన్ ఫైర్

Harbhajan Singh Says If I can do well in IPL, then I can do well in international cricket
Harbhajan Singh - 'Selectors Will Not Look At Me As They Feel I’m Too Old'

ముంబై: టీమిండియా సెలెక్టర్లపై సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండియన్ ప్రీమియర్(ఐపీఎల్) లీగ్‌లో తాను అద్భుతంగా రాణిస్తున్నా.. తనను ఓ ఆటగాడిగా పరిగణించడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. వరల్డ్ బెస్ట్ ఆటగాళ్లు ఆడే ఐపీఎల్‌లో రాణిస్తున్నప్పుడు.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎందుకు ఆడలేనని ప్రశ్నించాడు. సెలెక్టర్లు తనకు వయసు అయిపోయిందనుకుంటున్నారనీ, కానీ ఈ ఐపీఎల్ సీజన్‌లో కనుక తాను రాణిస్తే.. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20లు ఆడేందుకు అన్ని విధాల సిద్దమవుతానని తెలిపాడు.

 2016లో చివరిసారిగా..

2016లో చివరిసారిగా..

ఇక 2016 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన భజ్జీ ఇప్పటి వరకు రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఇక భారత్ తరఫున దుబాయ్ వేదికగా జరిగిన ఆసియాకప్ 2016లో చివరి సారిగా టీ20 క్రికెట్ ఆడిన భజ్జీ.. తర్వాత ఐపీఎల్ మినహా ఎలాంటి క్రికెట్ ఆడటంలేదు. ఓవైపు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ ఆడుతూనే మరోవైపు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక 2018 ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ భజ్జీని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఆడటానికి నేను రెడీ..

ఆడటానికి నేను రెడీ..

ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో భారత జట్టులోకి భజ్జీ రీ ఎంట్రీ కష్టమేననే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ పంజాబ్ ఆటగాడు మాత్రం టీమిండియా తరఫున ఆడాలనే ఆశలను మాత్రం వదులు కోవడం లేదు. మరోసారి భారత జెర్సీ ధరించడానికి సిద్దంగా ఉన్నానని తెలిపాడు. అగ్రశ్రేణి ఆటగాళ్ల ఉన్న ఐపీఎల్‌లో రాణిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో విఫలమయ్యే అవకాశాలు ఉండవని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడుతూ భజ్జీ అభిప్రాయపడ్డాడు.‘ఐపీఎల్ రాణిస్తే టీమిండియా తరఫున మరోసారి బరిలోకి దిగడానికి తాను సిద్దం. ఈ క్యాష్ రిచ్ లీగ్ బౌలర్లకు చాలా కఠినమైన టోర్నీ. ఎందుకంటే చిన్న మైదానాలతో పాటు వరల్డ్ టాప్ ప్లేయర్లు ఉంటారు. వారికి బౌలింగ్ చేయడం సవాల్‌తో కూడుకున్నది. అలాంటి పరిస్థితులు ఉన్న ఐపీఎల్‌లో రాణిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించడం పెద్ద కష్టమేమి కాదు. నేను పవర్ ప్లే, మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేసి వికెట్లు కూడా దక్కించుకున్నా.'అని భజ్జీ చెప్పుకొచ్చాడు.

నా వయసు అయిపోందని..

నా వయసు అయిపోందని..

ఇక ఐపీఎల్‌లో భజ్జీకి మంచి రికార్డు ఉంది. 157 ఇన్నింగ్స్‌ల్లో 150 వికెట్లతో ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించినా.. వయసు అయిపోయిందనే ఒకే కారణంతో సెలెక్టర్లు తనను పరిగణలోకి తీసుకోవడం లేదన్నాడు.‘సెలెక్టర్లు నావైపు కనీసం చూడను కూడా చూడటం లేదు. నా వయసు అయిపోయిందని వారు ఫీలవుతున్నారు. గత నాలుగేళ్లుగా ఎలాంటి డొమెస్టిక్ క్రికెట్ ఆడకున్నా ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించా. అయినా సెలెక్టర్లు నన్ను పట్టించుకో లేదు.'అని ఈ ఆఫ్ స్పీన్నర్ అసహనం వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ టీమ్స్ చాలా స్ట్రాంగ్

ఐపీఎల్ టీమ్స్ చాలా స్ట్రాంగ్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్న జట్ల కన్నా ఐపీఎల్ టీమ్స్ చాలా బలమైనవని ఈ ఆఫ్ స్పిన్నర్ చెప్పుకొచ్చాడు. ‘అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని జట్లలో నాణ్యమైన ఆటగాళ్లు లేరు. కానీ ఐపీఎల్‌లో మాత్రం టాప్-6 మంచి ప్లేయర్లు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ మాత్రమే మంచి బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్నాయి. ఐపీఎల్‌లో వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్, జాన్నీ బెయిర్‌స్టోలు ఔట్ చేసిన నేను.. అంతర్జాతీయ క్రికెట్‌లో వారిని ఔట్ చేయలేనా?'అని హర్భజన్ సెలెక్టర్ల తీరును తప్పుబట్టాడు.

టీమిండియాలో అతనే బెస్ట్ ఫీల్డర్: సురేశ్ రైనా

Story first published: Monday, May 25, 2020, 12:08 [IST]
Other articles published on May 25, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+