IND vs NZ: హార్దిక్ పాండ్యాకు మరో గాయం.. న్యూజిలాండ్ పర్యటనకు దూరం!
న్యూజిలాండ్ పర్యటనకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ పర్యటనకు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హార్దిక్ పాండ్యా టీమిండియాకు దూరమై 5 నెలలు కావస్తుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో చివరిసారిగా ఆడిన అతనికి గాయాల బెడద వేధిస్తోంది. ఒక గాయం నుంచి కోలుకునేలోపే మరో గాయమవుతుంది. ఇలా ఈ 5 నెలల వ్యవధిలోనే హార్దిక్ పాండ్యా మూడు సార్లు గాయపడ్డాడు.
ఐపీఎల్ 2026 అనంతరం బీసీసీఐ సెంట్రల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ)లో చేరి రిహాబిలిటేషన్ తీసుకున్నాడు. అతని గాయాల చరిత్ర నేపథ్యంలో ఫిట్‌నెస్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టిన హార్దిక్ పాండ్యా.. బెంగళూరుకి తన మకాం మార్చాడు. సీఓఈకి దగ్గరలోని ఇల్లును అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. కానీ గత ఐదు నెలలుగా కోలుకోలేకపోతున్నాడు.
హార్దిక్ పాండ్యాకు తాజాగా మరో గాయం
వాస్తవానికి భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్‌కే హార్దిక్ పాండ్యా అందుబాటులోకి వస్తాడని అంతా అనుకున్నారు. సెప్టెంబర్ 20లోపు అతను పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధిస్తాడని సీఓఈ వర్గాలు పేర్కొన్నాయి. ఆస్ట్రేలియా-ఏతో జరిగే వన్డే సిరీస్‌కు భారత్-ఏ తరఫున ఆడేందుకు హార్దిక్ పాండ్యాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. కానీ హార్దిక్‌కు తాజాగా మరో గాయమైనట్లు తెలుస్తోంది.

అతని కుడి కాలి పిక్కకు గాయం కావడంతో న్యూజిలాండ్ పర్యటనకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత్ ఐదు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌లు ఆడనుంది. హార్దిక్ పాండ్యా గాయం గురించి ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి వెల్లడించాడు.
రెండు వారాల విశ్రాంతి..
'ఇది చాలా దురదృష్టకరం. హార్దిక్ పాండ్యా తాజా స్కానింగ్ రిపోర్ట్‌లో అతని కుడి పిక్కకు గాయమైనట్లు తేలింది. అతనికి రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి ఇవ్వాలని వైద్యులు సూచించారు. బీసీసీఐ మెడికల్ టీమ్ హెడ్ డాక్టర్ దిన్‌షా పార్దివాలా అతని రిపోర్ట్‌లను పరిశీలించారు. ఆయన జపాన్ నుంచి తిరిగి వచ్చాక.. హార్దిక్‌ను పరీక్షించి రిహాబిలిటేషన్ ఎప్పుడు మొదలు పెట్టవచ్చనే విషయంపై నిర్ణయం తీసుకుంటారు.'అని సీఓఈని పర్యవేక్షిస్తున్న సదరు అధికారి వెల్లడించారు.
ఐపీఎల్‌లో గాయపడిన హార్దిక్ పాండ్యా అఫ్గానిస్థాన్ వన్డే, టీ20 సిరీస్‌లతో పాటు ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలకు దూరంగా ఉన్నాడు. అప్‌కమింగ్ ఆసియా గేమ్స్‌తో పాటు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్, న్యూజిలాండ్ పర్యటనకు అందుబాటులో లేకుండా పోయాడు. ఆసియా గేమ్స్ 2026కు ముందు హార్దిక్ ఫిట్‌నెస్ సాధిస్తాడని అంతా అనుకున్నారు. ఫీల్డింగ్ డ్రీల్స్ చేసే సమయంలో అతని మొకాలికి గాయమైంది. దాంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది.
హార్దిక్‌పై ఆశలు వదులుకున్న టీమిండియా..
ఈ గాయం నుంచి కోలుకొని ఫిట్‌నెస్ టెస్ట్‌కు రెడీ అయ్యేలోపే.. కుడి కాలి పిక్కకు గాయమైంది. హార్దిక్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే.. వచ్చే ఏడాది జనవరిలో జింబాబ్వేతో జరిగే వన్డే సిరీస్‌తో పునరాగమనం చేయవచ్చు. హార్దిక్ పాండ్యా గాయాల చరిత్ర నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్ అతనికి బ్యాకప్‌గా పేస్ ఆల్‌రౌండర్లను సిద్దం చేస్తుంది. ఇప్పటికే నితీష్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకొని గొప్ప ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైంది. అతనికి బ్యాకప్‌గా సూర్యాన్ష్ షెడ్గేను రెడీ చేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


