తమ్ముడూ.. ఇది ఐపీఎల్ కాదు! వైభవ్‌ను ఎగతాళి చేసిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మొయిన్ అలీ ఎగతాళి చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ ఏం ఐపీఎల్ కాదని చురకలంటించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ నెట్స్‌లో జోఫ్రా ఆర్చర్‌ను వైభవ్ సూర్యవంశీ చితక్కొట్టాడని వార్తలు వచ్చాయి. అతని ఓవర్‌లో వరుసగా సిక్స్‌లు బాదాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై మొయిన్ అలీ ఘాటుగా స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్.. ఐపీఎల్ నెట్స్ తరహాలో ఉండదని చురకలంటించాడు.
ఐపీఎల్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన వైభవ్.. 237.50 స్ట్రైక్‌రేట్‌తో 776 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతోనే టీమిండియాలోకి వచ్చిన వైభవ్.. ఆ జోరును మాత్రం కొనసాగించలేకపోతున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20తో వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 14, 13, 15 పరుగులతో తీవ్రంగా నిరాశపర్చాడు. ఇందులో రెండు సార్లు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.

అయితే రాజస్థాన్ రాయల్స్ నెట్స్‌లో జోఫ్రా ఆర్చర్‌ను వైభవ్ చితక్కొట్టాడని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెట్టారు. ఈ విషయంపై మొయిన్ అలీ ఒక షోలో మాట్లాడాడు. వైభవ్‌ను ఉద్దేశించి అతను చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
'రాజస్థాన్ రాయల్స్ నెట్స్‌లో జోఫ్రా ఆర్చర్‌ను వైభవ్ సూర్యవంశీ చీల్చి చెండాడాడనే పోస్ట్‌లను సోషల్ మీడియాలో చూశాను. కానీ నెట్స్‌లో ఆడటం వేరు.. అంతర్జాతీయ క్రికెట్ వేరు అని ఆర్చర్ బౌలింగ్ నిరూపించింది. బౌన్సర్‌తో వైభవ్ సూర్యవంశీని ఆర్చర్ ఔట్ చేసిన తీరు అద్భుతం. వైభవ్ గొప్ప బ్యాటర్ అనడంలో సందేహం లేదు. కానీ అంతర్జాతీయ క్రికెట్ స్థాయి పెద్దది.'అని మొయిన్ అలీ చెప్పుకొచ్చాడు.
ఈ ఐదు టీ20ల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 0-3తో సిరీస్ కోల్పోయింది. ఆఖరి టీ20 శనివారం రాత్రి సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే టీమిండియ నెంబర్ ర్యాంక్‌ను కూడా కోల్పోనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

