వీళ్ల నుంచి కాదు.. అతన్ని టీ20ల్లోకి తీసుకోండి:క్రిష్ శ్రీకాంత్
టీ20 ఫార్మాట్‌లో వరుస పరాజయాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న టీమిండియాకు మాజీ చీఫ్ సెలెక్టర్ క్రిష్ శ్రీకాంత్ కీలక సలహా ఇచ్చాడు. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఇంగ్లండ్ కండిషన్స్‌లో రాహుల్ రాణించగలడని అభిప్రాయపడ్డాడు.
ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0తో సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. శనివారం సౌతాంప్టన్ వేదికగా ఆఖరి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలంటే కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవాలని క్రిష్ శ్రీకాంత్ సూచించాడు.
రాహుల్‌ను తీసుకోవాలి..
తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన క్రిష్ శ్రీకాంత్.. రాహుల్ టీ20 రికార్డ్ బాగుందని గుర్తు చేశాడు. అతను ఎలాంటి పిచ్‌లపైనైనా ఆడగలడని తెలిపాడు. 'ఇంగ్లండ్ వంటి కండిషన్స్‌లో కేఎల్ రాహుల్‌ను తప్పకుండా భారత టీ20 జట్టులోకి తీసుకోవాలి. శుభ్‌మన్ గిల్‌కు ఇప్పటికే చాలా అవకాశాలు లభించాయి. కానీ అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

దాంతోనే అతన్ని జట్టు నుంచి తొలగించారు. కానీ కేఎల్ రాహుల్‌కు అవకాశమే ఇవ్వడం లేదు. అతను టెస్ట్, వన్డే క్రికెట్ మాత్రమే ఆడేలా ప్లాన్ చేశారు. కానీ రాహుల్ టీ20 రికార్డ్స్ అద్భుతంగా ఉన్నాయి. అతను ఏలాంటి వికెట్‌పైనైనా ఆడగలడు.
ఫ్లాట్‌పిచ్‌లపై విధ్వంసం..
ఫ్లాట్ పిచ్‌లపై మాత్రమే భారత బ్యాటింగ్ విధ్వంసకరంగా ఉంటుంది. టీ20 ప్రపంచకప్‌లో కూడా స్లో వికెట్‌పై సౌతాఫ్రికాతో టీమిండియా ఆలౌటైంది. దాంతో భయపడిపోయిన భారత మేనేజ్‌మెంట్ ఫ్లాట్ వికెట్స్‌ను అడిగింది.
ఐపీఎల్‌లో కూడా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్లు తడబడ్డారు. ఎందుకంటే అక్కడ స్లో పిచ్‌లు ఉండటంతో పరుగులు చేయలేకపోయారు. భారత బ్యాటర్లు పేస్, బౌన్స్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తడి టెన్నిస్ బాల్‌తో ప్రాక్టీస్ చేయాలి.
కాళ్లు, చేతులు లేకుండా ఆడుతున్నాడు..
వాష్టింగ్టన్ సుందర్ అయితే చేతులు, కాళ్లు లేకుండా ఆడుతున్నాడు. అతని బ్యాటింగ్ దారుణం. బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని బౌలింగ్ పనికిరాకుండా పోయింది. గంభీర్‌కు ఇష్టమైన ఆటగాడు కావడంతో అతనికి జట్టులో ఎలాంటి పాత్ర ఇచ్చాడో నాకు అర్థం కావడం లేదు.
టెస్ట్ క్రికెట్‌కు మాత్రమే అతను పనికివస్తాడు. టీ20లకు అతను ఏ మాత్రం పనికిరాడు. పేస్, స్పిన్ బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడలేడు. ప్రత్యర్థి బ్యాటర్లు సుందర్ బౌలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. అతని బౌలింగ్‌లో కనీసం 15 పరుగులైనా పక్కా వస్తాయని వారికి తెలుసు.
దూబే భయపడుతున్నాడు...
ఇంగ్లండ్ పిచ్‌లపై ఆడేందుకు శివమ్ దూబే భయపడుతున్నాడు. త్వరగా ఔటై పెవిలియన్‌కు వెళ్లిపోవాలన్నట్లు బ్యాటింగ్ చేస్తున్నాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. జట్టులో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న బ్యాటర్లలో శివమ్ దూబే ఒకడు. అతని కారణంగానే నాలుగో టీ20లో భారత్ ఓటమిపాలైంది.'అని క్రిష్ శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

