మూడేళ్ల క్రితమే స్మృతి మంధానకు కెప్టెన్సీ ఇస్తారనుకున్నా: మిథాలీ రాజ్
భారత మహిళల జట్టు సారథ్య బాధ్యతల నుంచి హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పుకున్న నేపథ్యంలో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మూడేళ్ల క్రితమే స్మృతి మంధానకు కెప్టెన్సీ బాధ్యతలు దక్కుతాయని తాను భావించానని ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత మిథాలీ రాజ్ అన్న వ్యాఖ్యలు తాజాగా చర్చనీయాంశమయ్యాయి.
మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని 37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రకటించగానే.. 30 ఏళ్ల స్మృతి మంధానను నయా సారథిగా బీసీసీఐ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన మధ్య విభేదాల నేపథ్యంలోనే ఈ కెప్టెన్సీ మార్పు జరిగిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
హర్మన్, మంధాన మధ్య విభేదాలు..
2025 వన్డే ప్రపంచకప్ విజయానంతరం నుంచి తనకు కెప్టెన్సీ ఇవ్వాలంటూ మంధాన సెలెక్టర్లపై ఒత్తిడి తెచ్చిందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే హర్మన్‌ప్రీత్ కౌర్‌తో స్మృతి మంధానకు విభేదాలు తలెత్తాయని, జట్టు రెండు వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది.
ఈ విభేదాల కారణంగా మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ ఒకరినొకరు చూసుకోలేదనే పుకార్లు వెలువడ్డాయి. జట్టులోని మెజార్టీ ఆటగాళ్లు స్మృతి మంధానకు మద్దతుగా నిలిచారని వార్తలు వచ్చాయి.

మూడేళ్ల క్రితమే కెప్టెన్సీ ఇవ్వాల్సింది..
ఈ రూమర్లకు మరింత ఆస్యం పోసేలా ఉన్న మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 'కెప్టెన్‌గా స్మృతి మంధానకు మూడేళ్ల క్రితమే అవకాశం వస్తుందని భావించా. ఆమెకు వన్డే, టెస్ట్ సారథ్యం అప్పగించి.. మరో యువ క్రికెటర్ షెఫాలీ వర్మకు టీ20 జట్టు పగ్గాలు అప్పగిస్తే బాగుండేది'అని మిథాలీ తెలిపింది. తాజా పరిణామాలకు లింక్ చేస్తూ ఈ వ్యాఖ్యలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
మిథాలీ రాజ్ నుంచి హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్య బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా వీరిద్దరి మధ్య సంబంధాలు గొప్పగా ఏం లేవు. ఇప్పుడు మంధాన, హర్మన్ మధ్య కూడా అలాంటి పరిస్థితే ఉంది. ఇటీవల ఆసియా కప్, ఆసియా గేమ్స్‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ మెరుగైన ఫలితాలు సాధించినా.. బ్యాటర్‌గా విఫలమైంది. మరోవైపు స్మృతి మంధాన సూపర్ ఫామ్ కనబర్చింది.
ఈ క్రమంలోనే మంధానకు సారథ్య బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వ్యక్తమైంది. మరోవైపు హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ఒకే ఫార్మాట్ సారథ్య బాధ్యతలు ఆఫర్ చేయడంతో ఆమె పూర్తిగా తప్పుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఆటకు కూడా వీడ్కోలు పలకనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


