
భారత బ్యాటింగ్ దిగ్గజం మిథాలీరాజ్ సోమవారం షఫాలీ వర్మను 'Once In a Generation' (తరానికొక ప్లేయర్) అని అభివర్ణించింది. 18ఏళ్ల వయస్సులోనే అరుదైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న ప్లేయర్ షఫాలీ అని పేర్కొంది. ఇటీవలే అన్నిరకాల క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ.. తాను షఫాలీ ఆటకు 'పెద్ద అభిమానిని' అంటూ పేర్కొంది. రోహ్‌తక్‌లో జన్మించిన షఫాలీ.. 2021లో మిథాలీ కెప్టెన్సీలో వన్డే, టెస్ట్‌లలో అరంగేట్రం చేసింది. ఐసీసీ కొత్త పోడ్‌కాస్ట్ అయిన 100పర్సంట్ క్రికెట్ మొదటి ఎపిసోడ్‌లో మిథాలీ షఫాలీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'ఏ జట్టుపైనైనా టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించగల సామర్థ్యం షఫాలీ వర్మకు ఉంది. మీరు బహుశా ఒక తరంలో ఒకసారి చూడగలిగే ప్లేయర్లలో షఫాలీ ఒకరు' అని మిథాలీ పేర్కొంది.
'భారతీయ రైల్వేస్‌తో ఆడినప్పుడు దేశవాళీ మ్యాచ్‌లో షఫాలీని చూశాను. ఆమె హాఫ్ సెంచరీ చేసింది.. ఆమె తన ఇన్నింగ్స్‌తో మొత్తం మ్యాచ్‌ను మార్చగల ప్లేయర్ అని నేను అప్పుడే గ్రహించాను. 2019మహిళల టీ20ఛాలెంజ్ టోర్నీ టైంలో షఫాలీ ఫేమ్ పొందింది. ఇకపోతే ఆమె మిథాలీ నేతృత్వంలోని వెలాసిటీ జట్టు కోసం ఆ ఎడిషన్లో ఆడింది. 'ఆమె ఛాలెంజర్ ట్రోఫీ మొదటి ఎడిషన్‌లో వెలాసిటీ కోసం ఆడినప్పుడు.. ఆమె నా టీంలో ఉంది. అప్పుడే అరుదైన సామర్థ్యం, రా పవర్ ఆమెలో ఉన్న విషయాన్ని నేను చూశాను. ఆ వయసులోనే బౌండరీలను బాదడం, సిక్సర్లు కొట్టడం చూశాను.' అని మిథాలీ పేర్కొంది. ఇకపోతే షఫాలీ వర్మ ఇప్పటివరకు భారతదేశం తరపున 32 టీ20లు, 18 వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. అన్ని ఫార్మాట్లో కలిసి ఆమె 1517పరుగులు చేసింది. ఆమె టెస్ట్ ఫార్మాట్‌లో ఇంగ్లాండ్‌పై 96పరుగులు చేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచింది.
రాబోయే కామన్వెల్త్ గేమ్స్ కోసం హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని 15మంది సభ్యుల భారత జట్టులో షఫాలీకి చోటు దక్కింది. ఆస్ట్రేలియా, బార్బడోస్, పాకిస్థాన్‌లతో కలిసి భారత్ గ్రూప్-ఎలో ఉంది. అదే సమయంలో.. శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా గ్రూప్ Bలో ఉన్నాయి. జూలై 29న ఎడ్జ్‌బాస్టన్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జులై 31న పాకిస్థాన్‌తో ఆగస్టు 3న బార్బడోస్‌తో భారత్ తలపడనుంది.