ఫిలిప్స్ కాదు.. అదే మా విజయానికి కారణం: మిచెల్ సాంట్నర్
పవర్ ప్లేలోనే భారత్ వికెట్లు తీయడం తమ విజయానికి కలిసొచ్చిందని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. గాలుల వల్ల డ్యూ రాకపోవడం కూడా తమకు కలిసొచ్చిందని చెప్పాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 87 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో తొలి విజయాన్ని అందుకుంది. దాంతో 3-1తో సిరీస్ క్లీన్‌స్వీప్‌ను తప్పించుకుంది.
ఈ విజయానంతరం మాట్లాడిన మిచెల్ సాంట్నర్ తమ బౌలర్లతో పాటు మైఖెల్ బ్రెస్‌వెల్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. బ్రేస్ వెల్ విధ్వంసకర బ్యాటింగ్‌తోనే 260 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేశామని చెప్పాడు.
పవర్ ప్లేలోనే వికెట్లు తీయడంతో..
'ఈ మ్యాచ్‌లో కూడా టాస్ ఓడిపోయాం. కానీ గాలి వల్ల ఈ మ్యాచ్‌లో డ్యూ ప్రభావం కనిపించలేదు. వాస్తవానికి 260 పరుగుల లక్ష్యం మంచిదే. కానీ డేంజరస్ బ్యాటర్లు కలిగిన భారత్‌ను కట్టడి చేయాలంటే మెరుగ్గా బౌలింగ్ చేయాలి. మేం అదే చేసి చూపించాం.

పిచ్‌ను మేం సరిగ్గా అంచనా వేసాం. ఆరంభంలో బంతులు వేగంగా దూసుకురావడంతో లెంగ్త్‌కు కట్టుబడి ఆడాం. మా ప్లేయర్లు అద్భుతమైన షాట్స్ ఆడారు. అలాగే బౌలింగ్‌లో పవర్ ప్లేలోనే వికెట్లు తీయగలిగాం. ఇది మ్యాచ్‌ను మావైపు మలుపు తిప్పింది. ఈ రోజు మా బౌలింగ్ అద్భుతంగా ఉంది. సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేశాం. పిచ్ నుంచి కూడా అడ్వాంటేజ్ లభించింది. మేం ఇలాంటి పిచ్‌లనే కోరుకుంటాం. బౌన్సీ పిచ్‌లపై మా ప్రణాళికలు సరిగ్గా అమలవుతాయి.
బ్రెస్‌వెల్ బ్యాటింగ్ అమోఘం..
మైఖేల్ బ్రెస్‌వెల్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. క్రీజులోకి వచ్చిన తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాడు. మేం అప్పటికే మంచి స్థితిలో ఉన్నాం. కానీ అతని దూకుడు కారణంగా 220 పరుగులు చేయాల్సి మేం 260 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేశాం. గ్లేన్ ఫిలిప్స్ కూడా బాగా ఆడాడు. నెట్స్‌లో బ్రేస్‌వెల్ భారీ షాట్స్ ప్రాక్టీస్ చేస్తాడు. అతను ఇలా దూకుడుగా పరుగులు చేయడం చాలా సంతోషంగా ఉంది.
ఈ విజయం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. ఇదొక కఠినమైన మైదానం. మా బౌలర్లు వేసిన షార్ట్ లెంగ్త్ డెలివరీలకు భారత బ్యాటర్లు భారీ షాట్స్ ఆడలేకపోయారు. కొన్ని క్యాచ్‌లు వదిలేసాం. గాలి కారణంగా క్యాచ్‌లు అందుకోవడం కష్టమైంది. ఓవరాల్‌గా మా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాం. పవర్ ప్లేలో వ్యూహాత్మకంగా బౌలింగ్ చేశాం. బౌలర్లను ఎప్పటికప్పుడూ మార్చాం. తొలి ఓవర్ నుంచే మా బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేశారు. ముఖ్యంగా డఫీ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు.'అని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


