Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌ను ఓడించే దమ్ము మాకు లేదు: పాకిస్థాన్ హెడ్ కోచ్

భారత క్రికెట్ జట్టుపై పాకిస్థాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. వైట్ బాల్ క్రికెట్‌లో టీమిండియాకు తిరుగులేదని, పవర్‌ఫుల్ టీమ్ అని కొనియాడాడు. పాకిస్థాన్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రతీ జట్టు భారత్‌ను ఓడించడానికి ఇబ్బంది పడుతుందని తెలిపాడు. ఇటీవల పాకిస్థాన్ జట్టు ప్రదర్శనలపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ మైక్ హెస్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

IND vs ENG: కోహ్లీ, రోహిత్‌ కూడా చేయలేనిది.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డ్!

IND vs ENG: కోహ్లీ, రోహిత్‌ కూడా చేయలేనిది.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డ్!

'గతేడాది ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లు మినహా అన్ని మ్యాచ్‌ల్లో మేం గెలిచాం. వాస్తవం ఏంటంటే ప్రస్తుతం ప్రపంచంలోని ఏ జట్టైనా భారత్‌ను ఓడించడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. కేవలం పాకిస్థాన్ మాత్రమే కాదు.. ప్రతి జట్టూ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది.

Pakistan Coach Mike Hesson Makes Honest Admission on Failure to Beat India
Photo Credit: X (twitter)

తప్పో ఒప్పో పక్కన పెడితే భారత్‌తో ఆడేటప్పుడు పాకిస్థాన్ ప్రదర్శన ఎలా ఉందన్న దాని ఆధారంగానే ఆ జట్టును అంచనా వేస్తుంటారు. ప్రస్తుతం టీమిండియా అత్యుత్తమ జట్టు మాత్రమే కాదు.. మిగిలిన జట్ల కంటే ఎంతో ముందుండి మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. పాకిస్థాన్ పెద్ద టోర్నీల నాకౌట్ దశల్లో నిలకడగా చోటు దక్కించుకునే జట్టుగా ఎదగాలంటే అన్ని జట్లపైనా క్రమం తప్పకుండా విజయాలు సాధించాల్సి ఉంది.'అని మైక్ హెస్సన్ అభిప్రాయపడ్డాడు.

ఆసియా కప్ 2025 టోర్నీలో భారత్‌తో ఫైనల్‌తో సహా మూడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్.. ఈ మూడింటిలోనూ ఓటమిపాలైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో దాయాదీ దేశాలు ఒకసారి తలపడగా భారత్‌నే విజయం వరించింది. వైట్ బాల్ క్రికెట్‌లో టీమిండియాకు ఎదురు లేకుండా పోయింది.

IND vs ENG: వాటర్‌ బాయ్‌గానే వైభవ్.. రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs ENG: వాటర్‌ బాయ్‌గానే వైభవ్.. రెండో టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఓడినా.. వరుసగా మూడు టోర్నీల్లో (ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024, 2026) భారత్ విజేతగా నిలిచింది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్‌లో వరుసగా 16 ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచిన భారత్.. ఇటీవలే పసికూన ఐర్లాండ్ చేతిలో రెండు టీ20ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్.. తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో టీ20 శనివారం జరగనుంది.

Story first published: Friday, July 3, 2026, 11:32 [IST]
Other articles published on Jul 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+