IND vs NZ: గంభీర్ ఆ తప్పు చేస్తే.. ఆ ఇద్దరి ఆటగాళ్లు కెరీర్ నాశనమవుతోంది: మాజీ క్రికెటర్
న్యూజిలాండ్‌తో మూడో టీ20లో ప్రిన్స్ యాదవ్‌నే కొనసాగించాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సూచించాడు. లేదంటే ప్రిన్స్ యాదవ్‌తో పాటు మయాంక్ యాదవ్ ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుందని అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత్.. మంగళవారం మూడో టీ20 ఆడనుంది.
అయితే ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో మయాంక్ యాదవ్‌ను ఆడించిన భారత్.. రెండో టీ20లో ప్రిన్స్ యాదవ్‌ను బరిలోకి దించింది. డెత్ ఓవర్ల బౌలింగ్ కోసం ప్రిన్స్ యాదవ్‌ను తీసుకుంది. మయాంక్ యాదవ్ 4 ఓవర్లు వేసి 40 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయగా.. రెండో టీ20లో ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు.

అయితే మూడో టీ20 నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన ఆకాష్ చోప్రా.. టీమిండియాకు ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను ఆడించాల్సిన అవసరం లేదన్నాడు. అంతేకాకుండా ప్రిన్స్ యాదవ్ స్థానంలో మయాంక్ యాదవ్ కూడా అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.
'వెల్లింగ్టన్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి జట్టుకు ముగ్గురు పేసర్లతో పాటు ఒక స్పిన్నర్ సరిపోతాడు. తుద జట్టులో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు.'అని అభిప్రాయపడ్డాడు.
అయితే బ్యాటింగ్ విభాగంలో మాత్రం చిన్న మార్పు చేయాలన్నాడు. ఫస్ట్ డౌన్‌లో ఆడించిన వైభవ్ సూర్యవంశీని ఓపెనర్‌గా ఆడించాలని చెప్పాడు. ప్రస్తుత ఓపెనింగ్ జోడీ బాగా రాణిస్తున్నప్పటికీ, భవిష్యత్తు కోసం ఆటగాళ్లను సిద్దం చేసేందుకు ఇదే సరైన అవకాశం అని చెప్పాడు.
వైభవ్ సూర్యవంశీ చాలా రోజులుగా ప్రత్యామ్నాయ ఆటగాడిగానే జట్టులో కొనసాగుతున్నాడని, సంజూ శాంసన్‌తో కలిసి అతను ఓపెనింగ్ చేయాలని అభిప్రాయపడ్డాడు. అభిషేక్ శర్మను మూడో స్థానంలో బ్యాటింగ్ చేయించాలని సూచించాడు. ఇషాన్ కిషన్ ఫిట్‌నెస్ సాధిస్తే వైభవ్ తప్పుకోవాల్సింది కాబట్టి అతనికి ఓపెనర్‌గా అవకాశం ఇచ్చి పరీక్షించాలని ఆకాష్ చోప్రా సూచించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


